వాట్సాప్‌ పాలసీని ఆమోదించకుంటే ఏమవుతుంది?

ABN , First Publish Date - 2021-03-06T06:04:54+05:30 IST

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 8 లోపు కొత్త ప్రైవేటు పాలసీకి ఆమోదం తెలపాలని వినియోగదారులను వాట్సాప్‌ హెచ్చరించింది. అయితే గందరగోళం జరగడంతో మే 15కి వాయిదా వేసింది. అయితే ఈ కొత్త పాలసీకి ఆమోదం తెలుపకుంటే ఏమవుతుందనేది

వాట్సాప్‌ పాలసీని ఆమోదించకుంటే ఏమవుతుంది?

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త  బంధనలతో ప్రైవేటు పాలసీని రూపొందించడం, అయోమయం తలెత్తడంతో వాయిదా వేయడం తెలిసిందే. 

   

వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 8 లోపు కొత్త ప్రైవేటు పాలసీకి ఆమోదం తెలపాలని వినియోగదారులను వాట్సాప్‌ హెచ్చరించింది. అయితే గందరగోళం జరగడంతో మే 15కి వాయిదా వేసింది. అయితే ఈ కొత్త పాలసీకి ఆమోదం తెలుపకుంటే ఏమవుతుందనేది ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న.


ఆమోదం తెలపని వినియోగదారుల అకౌంట్లు డిలీట్‌ కావు. అయితే అవి పరిమితంగానే పనిచేస్తాయి. మొదటగా మెసేజ్‌లు పంపేందుకు, చదివేందుకు వీలుపడదు. నోటిఫికేషన్లు మాత్రం వస్తాయి. ఈ వెసులబాటు కూడా కొద్ది కాలమే ఉంటుంది. ఈలోపు సదరు విషయాలపై పాపప్‌ నోటిఫికేషన్లు, స్టోరీలతో వినియోగదారులకు వాట్సాప్‌ అవగాహన కలిగిస్తుంది.


కొత్త పాలసీలో ఏముంది?

బిజినెస్‌ అకౌంట్లలో మెస్సేజింగ్‌లో చేసిన మార్పులు ప్రధానంగా కొత్త పాలసీలో ఉన్నాయి. దరిమిలా సరికొత్త డేటా షేరింగ్‌ పాలసీకి ఆమోదం తెలపాలని వినియోగదారులను కోరింది. అంటే ఫేస్‌బుక్‌ ద్వారా  జరిగే వ్యాపారపరమైన చర్చలను షేర్‌ చేస్తారు. 


ప్రమాదకరమా?

వాట్సాప్‌ కొత్త పాలసీ ప్రకారం వినియోగదారుడి చాట్స్‌ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటాయి. మూడో పార్టీ ఈ మెసేజ్‌లు చదవలేదు, కాల్స్‌ను వినలేదని వాట్సప్‌ చెబుతోంది.

 

మూడో పార్టీ చదవగలదా?

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రత కలిగి ఉన్నందున మూడో పార్టీకి వినియోగదారుడి చాట్స్‌ యాక్సెస్‌లో ఉండవు. మెసేజ్‌ పంపిన, అందుకున్న వ్యక్తులు మాత్రమే చాట్స్‌ చదవగలుగుతారు. 


నంబర్‌ ఇవ్వకుండా కుదురుతుందా?

‘క్లిక్‌ టు చాట్‌’ ఫీచర్‌తో వాట్సాప్‌ సదుపాయం లభిస్తుంది. అవతలి వ్యక్తి ఫోన్‌ నంబర్‌ మన ‘ఫోన్‌ బుక్‌’లో లేనప్పటికీ మెసేజ్‌ అందుకోవచ్చు. అయితే ఎవరితో మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి ఫోన్‌ నంబర్‌  తప్పనిసరి.


వాట్సాప్‌ కాల్‌ను వేరే వ్యక్తి వింటారా?

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయి ఉన్నందున కంపెనీకి చెందిన మూడో పార్టీ కాల్‌లో జరిపిన సంభాషణలను వినడం సాధ్యం కాదు.

Updated Date - 2021-03-06T06:04:54+05:30 IST