Abn logo
Nov 4 2020 @ 14:40PM

కూరలు అస్సలు తినట్లేదు.. ఏం చేయాలి..?

ఆంధ్రజ్యోతి(04-11-2020)

ప్రశ్న: మా పాపకు నాలుగేళ్లు. అన్ని కూరగాయలూ పెట్టొచ్చా. వెజిటబుల్స్‌ని ఇష్టంగా తినే మార్గం ఏదైనా ఉందా?


-భవానీ, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఏడాది దాటినప్పటి నుండి పిల్లలకు అన్ని రకాల కూరగాయలు పెట్టవచ్చు. సాధారణంగా రెండేళ్లలోపు పిల్లలకు ఏవైతే రుచులు పరిచయమవుతాయో, అవే రుచు లను వారు ఇష్టపడి తింటారు. మీ పాప వయసు పిల్లలు కూరగాయలు ఇష్టపడేలా చేయడానికి ఎన్నో మార్గాలు. చప్పగా కలపకుండా కొంచెం రుచి ఉండేలా అన్నంలో కలిపి పెడితే నెమ్మదిగా అలవాటు పడుతుంది. ఏదైనా ఓ కూర ఇష్టపడకపోతే ఒకటి, రెండు సార్లు పెట్టడానికి ప్రయత్నించి ఆ సమయానికి పెట్టడం ఆపెయ్యాలి. బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తే మొండికేసి రుచి కూడా చూడకుండా మానే స్తారు. ఓ రెండు వారాల తరువాత మళ్లీ అదే కూరను వేరే రకంగా వండి పెట్టడానికి ప్రయత్నించండి. ఇదంతా చాలా ఓపికతో చేయాల్సిన పని. అయినా ఇలాగే పలు మార్లు చేస్తే పిల్లలు నెమ్మదిగా ఇష్టాలను పెంచుకునే అవకాశం ఉంది. ఇంకోవిషయం, పిల్లల ఎదురుగా ఇంట్లో ఎవ్వరూ ఫలానా కూర బాగాలేదు, నాకు వద్దు, నేను తినను లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దీనివల్ల కూడా పిల్లలు కూరగాయలపై అయిష్టం పెంచుకునే అవకాశం ఉంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement
Advertisement
Advertisement