అప్లికేషన్స్‌కు సబ్ర్స్కిప్షన్‌ ఏమిటి?

ABN , First Publish Date - 2020-09-26T06:02:31+05:30 IST

ఈమధ్య కాలంలో అనేక అప్లికేషన్స్‌ విడిగా పూర్తిగా కొనడానికి వీల్లేకుండా, సబ్ర్స్కిప్షన్‌ ఆధారంగా లభిస్తున్నాయి...

అప్లికేషన్స్‌కు సబ్ర్స్కిప్షన్‌ ఏమిటి?

  • ఈమధ్య కాలంలో అనేక అప్లికేషన్స్‌ విడిగా పూర్తిగా కొనడానికి వీల్లేకుండా, సబ్ర్స్కిప్షన్‌ ఆధారంగా లభిస్తున్నాయి. అప్లికేషన్‌ తయారీ సంస్థలు ఎందుకు ఇలాంటి పద్ధతిని అవలంభిస్తున్నాయి?
  • - రాజహంస


విండోస్‌ ప్రోగ్రామ్స్‌ తీసుకుంటే అడోబ్‌ ఫొటోషాప్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ వంటి  ప్రముఖమైన అప్లికేషన్స్‌ రెండు దశాబ్దాలకు పైగా సబ్ర్స్కిప్షన్‌ ఆధారంగానే లభిస్తున్నాయి. ఇవే కాదు మొబైల్‌ వినియోగం పెరిగిన తరవాత, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం లేదా ఐఓయస్‌ ఆధారంగా పనిచేసే అనేక అప్లికేషన్స్‌ ఒకేసారి కొనుగోలు చేయటానికి కాకుండా, నెలవారీ సబ్ర్స్కిప్షన్‌ కింద వినియోగదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. ఆ సాఫ్ట్‌వేర్‌  తయారీ సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వేసిన కొత్త ఎత్తుగడ, ఈ సబ్ర్స్కిప్షన్‌ సర్వీసులు. అయితే దీనికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి మార్గం లేదు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ సంస్థ 2021లో తీసుకురాబోతున్న మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ కొత్త వెర్షన్‌ విడిగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి వీలుగా రూపొందుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

Updated Date - 2020-09-26T06:02:31+05:30 IST