ఆండ్రాయిడ్‌ వన్‌ అంటే?

ABN , First Publish Date - 2020-10-03T05:34:29+05:30 IST

ఆండ్రాయిడ్‌ వన్‌ అంటే?

ఆండ్రాయిడ్‌ వన్‌ అంటే?

కొన్ని ఫోన్లకి ఆండ్రాయిడ్‌ వన్‌ అని  ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందో  తెలుపగలరు? 

-  వెంకట్‌


గూగుల్‌ సంస్థ ఎప్పటికప్పుడు విడుదల చేేస ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కి శాంసంగ్‌, షామీ వంటి కంపెనీలు అనేక మార్పులు చేర్పులు చేసి ప్రత్యేకమైన స్కిన్‌ తగిలించి యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ మొత్తాన్ని మార్చేస్తాయి.  ఇలాంటి మార్పులు చేర్పులు ఏమీ లేకుండా,  ఒరిజినల్‌ ఆండ్రాయిడ్‌ని ఉన్నది ఉన్నట్టు వాడుతూ  స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచన కలిగిన కొన్ని కంపెనీలు గూగుల్‌ సంస్థ సృష్టించిన ఆండ్రాయిడ్‌ వన్‌లో భాగంగా ఉంటాయి. ఇందులోనుంచి ఏదైనా మోడల్‌ విడుదల చేసినప్పుడు, అది కచ్చితంగా గూగుల్‌ విడుదల చేసిన ఒరిజినల్‌ ఆండ్రాయిడ్‌ మాదిరిగానే ఉండాలి. ఉదాహరణకు నోకియా సంస్థ విడుదల చేసే దాదాపు అన్ని ఫోన్స్‌ ఇందులో భాగంగా ఉంటాయి.  ఇలాంటి ఫోన్‌ల పనితీరు పరోక్షంగా వేగంగా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్డేట్స్‌ని అందిస్తారు. కేవలం గూగుల్‌ సంస్ధకు చెందిన ముఖ్యమైన అప్లికేషన్స్‌ తప్పించి వేరే ఏ ఇతర యాప్స్‌ ఆండ్రాయిడ్‌ వన్‌ ఫోన్లలో  కొనేటప్పుడు ఉండవు.  మన అవసరాన్ని బట్టి మనమే ప్రత్యేకంగా డౌన్లోడ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-10-03T05:34:29+05:30 IST