Advertisement
Advertisement
Abn logo
Advertisement

అఫ్ఘానిస్తాన్ సంక్షోభ సమయంలో నువ్వే కనుక అక్కడ ఉంటే ఏం చేస్తావ్.. UPSC టాపర్‌కు ఇంటర్వ్యూలో ప్రశ్న... ఆమె ఏం చెప్పిందంటే...

జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన యువతి అహింసా జైన్ యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించారు. 2020లో జరిగిన ఈ పరీక్షలో ఆమె 164వ ర్యాంకు దక్కించుకున్నారు. ప్రస్తుతం నాగపూర్‌లోని ఎన్ఏడీటీలో శిక్షణ తీసుకుంటున్న ఆమె తన ఆరవ ప్రయత్నంలో విజయం సాధించారు. వరుసగా రెండవసారి యూపీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. ఈసారి ఆమె 53వ ర్యాంకు దక్కించుకున్నారు. తనను ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఆమెనే స్వయంగా తెలిపారు.... నా ఇంటర్వ్యూ ఆగస్టు 23న ఆర్‌ఎన్ చౌబే బోర్డులో జరిగింది. ఆ సమయంలో నేనెంతో నెర్వస్‌గా ఉన్నాను. చౌబే సర్ వాతావరణాన్ని శాంతపరిచారు. 

సర్ నన్ను మొదటగా... ‘మీరు ఐఆర్ఎస్ జాబ్‌లోకి వచ్చారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది. అకాడమీలో ఏమేమి  నేర్చుకున్నారు? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది? అని అడిగారు. దీనికి సమాధానమిచ్చాను. ఆ తరువాత ‘అఫ్ఘానిస్తాన్ సంక్షోభం సమయంలో నువ్వే కనుక అక్కడ ఉంటే ఏం చేస్తావ్? మన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా? అని అడిగారు. దీనికి సమాధానంగా నేను... ‘ఇండియా డెమొక్రెటిక్ కంట్రీ. అఫ్ఘానిస్తాన్ తాలిబన్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అది ఉగ్రవాదాన్ని పోషిస్తూ, డెమొక్రసీ మీద నమ్మకంలేని సంస్థ. ఈ కారణంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. నేను కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంటాను’ అని చెప్పాను.

బోర్డు మెంబర్స్ వారి ప్రశ్నలన్నీ అయిపోయాక నా గురించి చెప్పమన్నారు. దీంతో నేను నా సైకిలింగ్ హాబీ గురించి చెప్పాను. మూడవ క్లాసు నుంచే సైకిల్‌పై స్కూలుకు వెళ్లేదానినని, అదే నా హాబీగా మారిపోయిందని తెలిపాను. మా నాన్న, అన్నయ్య నాకు సైకిల్ తొక్కడం నేర్పారు. చివరిగా నేను ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన...‘ జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ నిలిపేందుకు తొక్కుతూనే ఉండాలి’ అనే కొటేషన్ గుర్తుచేస్తూ ముగించాను. ఇది బోర్డు సభ్యులకు ఎంతగానో నచ్చిందని అహింసా జైన్ తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement