పనస వల్ల లాభాలు ఏమిటి?

ABN , First Publish Date - 2021-07-17T20:21:10+05:30 IST

పనస కాయ పచ్చిగా ఉన్నప్పుడు పైన గరకుగా ఉండే చెక్కుని తొలగించి కూర చేసుకోవడానికి వాడే దానినే పనస పొట్టు అంటారు. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువ. పనస పొట్టు వండినపుడు మాంసంలా ఉండడం వల్ల దీనిని మాంసానికి ప్రత్యామ్నాయంగా శాకాహార వంటల్లో వాడతారు.

పనస వల్ల లాభాలు ఏమిటి?

ఆంధ్రజ్యోతి(17-07-2021)

ప్రశ్న: పనస తొనలు, పనస పొట్టు పోషక విలువలు తెలియచేయండి. 


- కృష్ణారావు, విజయనగరం


డాక్టర్ సమాధానం: పనస కాయ పచ్చిగా ఉన్నప్పుడు పైన గరకుగా ఉండే చెక్కుని తొలగించి కూర చేసుకోవడానికి వాడే దానినే పనస పొట్టు అంటారు. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువ. పనస పొట్టు వండినపుడు మాంసంలా ఉండడం వల్ల దీనిని మాంసానికి ప్రత్యామ్నాయంగా శాకాహార వంటల్లో వాడతారు. తక్కువ మోతాదులో మాంసకృత్తులు, కొవ్వులు ఉన్నప్పటికీ పనసలో అధిక భాగం పిండిపదార్థాలే. పండే కొద్దీ ఈ తొనల్లో సహజమైన చక్కెరల శాతం పెరుగుతుంది. చాలా పండ్ల లాగానే ఇది కూడా ఓ మోస్తరు కెలోరీలనే కలిగి ఉంటుంది. వంద గ్రాముల పనస తొనలు కేవలం తొంభై కెలొరీలే. మనకు అవసరమైన దాదాపు అన్ని విటమిన్లు, ఖనిజాలు పనసలో ఎంతో కొంత ఉంటాయి. పనస కాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో, సోడియం  ప్రభావాలను తిప్పికొట్టడంలో సహాయ పడుతుంది. ఇది గుండె జబ్బులు, ఎముకలు బలహీనమవడాన్ని నివారిస్తుంది. కండరాలు, నరాల పని తీరును మెరుగుపరుస్తుంది. వయసు ప్రభావం, సూర్యరశ్మి వల్ల చర్మానికి జరిగే హాని నుండి పనసలో పుష్కలంగా ఉన్న విటమిన్‌- సి కాపాడుతుంది. ఇందులోని ఫైటో కెమికల్స్‌ నరాల రుగ్మతలను నివారించేందుకు, హార్మోన్ల సమతుల్యతను కాపాడేందుకు ఉపయోగపడతాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-17T20:21:10+05:30 IST