Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఛీ..ఛీ.. పాపులారిటీ కోసం మరీ ఇంత దిగజారాలా..? కన్నకొడుకుతో ఓ తల్లి చేసిన నిర్వాకమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో పాపులారిటీ కోసం కొందరు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పచ్చి బూతులు మాట్లాడుతూ పాపులర్ అయ్యి సంబర పడుతుంటే, మరికొందరు మరో గలీజు పని చేసి పేరు తెచ్చుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నారు. ఇదిగో అలా పాపులర్ అవ్వడం కోసం ఈ తల్లి చేసిన నిర్వాకం పెద్ద దుమారానికి దారితీసింది. ఆమెపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీలోని మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. ఇంతకీ సదరు మహిళ తన కుమారుడితో కలిసి ఏం చేసిందో తెలుసా? అసభ్యకరమైన నృత్యాలు, నటనలు చేస్తూ వీడియోలు చేసింది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి పాపులారిటీ కోసం పాకులాడింది. ఆమె ఖాతాకు 1.6లక్షలపైగా ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఈ తల్లి చేస్తున్న వీడియోలను చూసిన ఢిల్లీ మహిళా ఆయోగ్ (ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్) మండిపడింది. ఇలాంటి నృత్యాలు, నటనల ద్వారా పిల్లాడికి ఆ తల్లి ఏం నేర్పిస్తుందంటూ ధ్వజమెత్తింది. ఆమెపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఒక లేఖ రాసింది.

సదరు తల్లి ఇన్‌స్టా ఖాతాలో ఉన్న వీడియోల్లో కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసిన మహిళా ఆయోగ్.. ఆమెపై వెంటనే కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. 10-12 సంవత్సరాల వయసులో ఆ పిల్లాడికి ఇలాంటివి నేర్పడం వల్ల భవిష్యత్తులో అతను ఎలా మారతాడని ఈ కమిషన్ తన లేఖలో ప్రశ్నించింది. చిన్నతనంలోనే ఆడవారిని వస్తువులుగా చూడటం నేర్పిస్తే, భవిష్యత్తులో అతను మరిన్ని అపరాధాలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తల్లీబిడ్డల పవిత్ర బంధాన్ని ఆ తల్లి అవమానించేలా ప్రవర్తించిందని మండి పడిన మహిళా ఆయోగ్.. ఆమెపై వెంటనే కేసు పెట్టి, ఆ పిల్లాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరింది. ఆ పిల్లాడికి మంచి, చెడుల గురించి అవగాహన కల్పించాలని తెలిపింది.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement