Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోటి కలలతో ఆ తల్లిదండ్రులు 22 ఏళ్ల కూతురిని ఎంఎస్సీ చదివిస్తోంటే.. ఆమె ఇంత పనిచేసిందేంటి..!

చదువుకునే పిల్లలపై తల్లిదండ్రలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎన్నో కలలు కంటారు. వారికి ఏ సమస్య వచ్చినా కాపాడడానికి తల్లిదండ్రులు ముందుంటారు. కానీ తమ సమస్యలను ఎవరితోనూ పంచుకోకుండా మనోవేదనకు గురై కొందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంటారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో నివసించే అజయ్ కుమార్(55) కూతురు అనుదాస్(22) ఎంఎస్సీ చదువుకుంటోంది. చదువు పూర్తిచేసుకొని తన కూతురు పెద్ద ఉద్యోగంలో స్థిరపడితే.. అది చూసి తండ్రిగా అజయ్‌కుమార్ సంతోషపడాలనుకున్నాడు. కానీ అతని ఆశలు అడియాసలయ్యాయి. అనుకోకుండా ఒకరోజు అను అర్ధాంతరంగా చనిపోయింది.

గత సోమవారం (నవంబర్ 15) రాత్రి అను తన కుటుంబంతో పాటు భోజనం చేసి పడుకోవడానికి గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం ఎంతసేపటికీ అను లేవకపోయేసరికి అను తల్లిదండ్రలు ఆమె గది తలుపులు తెరిచి చూశారు. అక్కడ అను ఊరివేసుకొని వేలాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు.

ఆత్మహత్య చేసుకునేంత కష్టం అనుకు ఏమొచ్చిందో వారెవరికీ తెలియదు. అను గదిలో ఒక ఉత్తరం దొరికింది. చనిపోయేముందు అను రాసిన ఉత్తరం అది. అందులో తనకు భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందని.. పూర్తి స్పృహలోనే తాను ఆ నిర్ణయం తీసుకుంటున్నానని.. తనని క్షమించమని రాసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అను ఇంటికి చేరుకొని అంతా పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అనుకు కాలేజీలో, స్నేహితులతో ఏమైనా సమస్యలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement