Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్క మెసేజ్‌తో యువతిని ప్రేమలోకి దించాడు.. కొన్ని రోజుల తర్వాత అసలు కథ మొదలు.. చివరకు ఏమైందంటే..

యువతులను ముగ్గులోకి దించేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు ఏవేవో అబద్ధాలు చెప్పి నమ్మించి, చివరికి ప్రేమాయాణం మొదలెడతారు. ఈ క్రమంలో యువతుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం స్వచ్ఛమైన మనసుతో ప్రేమించి, చివరకు వారినే పెళ్లి చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన విచిత్రంగా ఉంది. ఓ మహిళకు మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన ఓ వ్యక్తి.. చివరికి ఆమెను ప్రేమలోకి దించాడు. అయితే చివరికి వారి కథ ఎంత వరకు వెళ్లిందంటే..

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ.. అబ్బూరులోని ఓ బ్యాంక్‌లో పనిచేస్తోంది. రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న ఆమెకు.. ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో కార్తీక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను చెన్నై ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని, డబ్బులు బాగా సంపాదించానని, పెళ్లి చేసుకుంటానని మెసేజ్ చేశాడు. అతడి మాటలు నమ్మిన మహిళ.. రోజూ అతడితో చాటింగ్ చేసేది. అనంతరం ఫోన్లలో మాట్లాడుకుంటూ బాగా దగ్గరయ్యారు. అయితే కొన్ని రోజుల తర్వాత అతడి నుంచి మళ్లీ ఓ మెసేజ్ వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం

తనకున్న ఆస్తులను నోట్ల రద్దు సమయంలో అమ్మేశానని, కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని నమ్మించాడు. ఐటీ అధికారులు నిలిపేయడంతో డబ్బులు తీసుకోలేకున్నానని చెప్పాడు. వారికి కొంత మొత్తం ముట్టచెబితే.. తన డబ్బంతా తనకు వస్తుందని తెలిపాడు. అతడి మాటలు నమ్మి.. రూ.32లక్షలు పంపించింది. తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరాతీశారు. మహిళను మోసం చేసిన వ్యక్తి పేరు మహరాజ్ జానీ రెక్స్ అని, అతడికి అప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పైగా ఇలాంటి మోసాలు చేసేందుకు నిందితుడి భార్య కూడా సహకరిస్తోందని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement