Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త ఆర్మీలో ఉద్యోగం, పిల్లలతో కలిసి భార్య ఒంటరి జీవితం.. కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుందని.. మామకు తెలియడంతో..

కొడుకు, కోడలు బాగుండాలని, మనువడు పుడితే ఆడుకుంటూ ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు. వారి సంసారంలో ఏవైనా సమస్యలున్నా నచ్చజెప్పి కాపురం సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటారు. కొడుకు, కోడలి సంక్షేమం కోసం.. అవసరమైతే తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటికెళ్లి.. సొంతంగా జీవించేందుకు కూడా సిద్ధమవుతారు. అయితే తమిళనాడులో ఓ మామ మాత్రం, కోడలిపై పగ పెంచుకున్నాడు. కోడలు వివాహేతర సంబంధం పెట్టుకుందని.. కొడుకు ముందే కోడలిపై తండ్రి దారుణానికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు తిరుపత్తూర్‌ జిల్లా నాట్రాంపల్లి జంగలాపురానికి చెందిన కుశివన్‌‌కు మురుగమ్మాల్‌ అనే యువతితో 2009లో వివాహమైంది. ప్రస్తుతం వారికి 8, 11 ఏళ్ల పిల్లలు ఉన్నారు. కుశివన్ కశ్మీర్‌లో సైనికుడిగా సేవలందిస్తున్నాడు. కుశివన్ భార్య మురుగమ్మాల్.. గతంలో గజనాయకన్‌ పట్టిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ ఉండేది. అయితే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరిందని రుజువవడంతో.. ఆమెను విధుల నుంచి తొలగించారు. అనంతరం ఈ కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఇదిలావుండగా.. కుశివన్‌కు భార్యతో విభేదాలు తలెత్తడంతో పిల్లలతో కలిసి మురుగమ్మాల్‌.. వేరే ఇంట్లో ఒక్కటి ఉంటోంది.

అయితే ఈ క్రమంలో ఆమె స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆనోటా, ఈనోటా కుశివన్ తండ్రి వరకు చేరింది. మరోవైపు ఓ ఇంటి విషయమై మురుగమ్మాల్‌కు, భర్త కుటుంబ సభ్యులకు వివాదం నడుస్తోంది. రోజూ ఈ విషయమై మామ, కోడళ్లు గొడవలు పడేవారు. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు రావడంతో ఇటీవల భర్త కుశివన్.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఓ వైపు ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే.. మరోవైపు ఇంటి విషయమై గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కుశీవన్‌ సెలవులపై సొంతూరుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకుని అతడి భార్య కుశివన్ ఇంటికి వచ్చింది.

అనంతరం ఇంటి విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు పొద్దునే మామ, కొడళ్లు ఇంటి విషయమై మళ్లీ గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన మామ.. కొడుకు ఎదుటే కోడలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం సైకిల్‌పై వెళ్లి..  నాట్రాంపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన కోడలు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో హత్య చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement