Advertisement
Advertisement
Abn logo
Advertisement

వదిన ఇంటికి వెళ్లిన యువకుడు సంతోషంగా గడిపాడు.. తిరిగి వస్తుంటే గ్రామస్తులు అలా చేసేసరికి.. షాక్ అయ్యాడు..

ఒక్కోసారి ఎవరు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలీదు. వీళ్లు మనుషులా కాదా అనే రీతిలో.. వాళ్లు చేసే పనులు ఉంటాయి. ఎదురుదెబ్బలు తినేవరకూ వారికి సత్యం బోధపడదు. బీహార్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన వదిన ఇంటికి వెళ్లి.. వారితో సంతోషంగా గడిపాడు. అనంతరం అన ఊరికి బయలుదేరాడు. అయితే గ్రామస్తులు అతన్ని అడ్డగించారు. చివరికి వాళ్లు చేసిన పనికి.. ఆ యువకుడు షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని నలంద జిల్లా ధనుకి సమీపంలోని గ్రామానికి చెందిన నితీష్ కుమార్ ఇంట్లో ఛథ్ పండుగ జరుగుతోంది. దీంతో బంధువులను పిలిచేందుకు బయలుదేరాడు. చుట్టుపక్కల గ్రామాల్లో అందరినీ ఆహ్వానించాడు. అనంతరం తన అన్న నివాసం ఉండే ధనుకి గ్రామానికి వెళ్లాడు. అన్న, వదిన, వారి పిల్లలతో సంతోషంగా గడిపాడు. అనంతరం వారిని కూడా ఆహ్వానించి, ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. అయితే ఉన్నట్టుండి గ్రామస్తులు అతన్ని అడ్డుకున్నారు. తుపాకీ చూపించి బెదిరించారు. అతన్ని వెంటే రావాలని డిమాండ్ చేయడంతో ఆ యువకుడు వారి వెంటే వెళ్లాడు. ఎక్కడి తీసుకెళ్తున్నారో అతడికి అర్థం కాలేదు.

అక్కడ నుంచి అతన్ని ఓ కల్యాణ మండపానికి తీసుకెళ్లారు. పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాని ఆ యువకుడు.. నిరాకరించాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా... దాడి చేసి మళ్లీ తీసుకొచ్చారు. వినకుంటే చంపేస్తాం అంటూ తుపాకీ గురిపెట్టారు. దీంతో కిక్కురుమనకుండా వారు చెప్పినట్లే చేశాడు. అనంతరం ఓ యువతిని పిలిపించి బలవంతంగా తాళి కట్టించారు. విధి లేని పరిస్థితుల్లో తాళి కట్టిన అతను.. తర్వాత వారి నుంచి బయటపడ్డాడు. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. పరోహా గ్రామానికి చెందిన సంజయ్ యాదవ్, గన్నూ యాదవ్ సహా మరికొందరు నిందితులుగా తేల్చారు. ప్రస్తుతం ఆ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement