Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్షణకాల సుఖ కోసం భర్తను జైలుకు పంపాలనుకుంది.. ఆఖరికి కూతురని కూడా చూడకుండా గొంతు నులిమింది.. చివరికి..

కేవలం.. కేవలం క్షణకాల సుఖం కోసం ఆమె.. ఏతల్లి, ఏభార్యా చేయరాని తప్పు చేసింది. కామంలో ఉన్న వారికి కళ్లు కనిపించవు అనే మాటను నిజం చేస్తూ.. ఆమె చేసిన పనికి జనమంతా ఛీకొట్టారు. వివాహేతర సంబంధానికి అలవాటు పడిన ఆమె.. అంతటితో ఆగకుండా ఆస్తిపై కూడా కన్నేసింది. ప్రియుడి మాటలు నమ్మి.. భర్తను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నింది. కన్న కూతురని కూడా చూడకుండా గొంతు నులిమేసింది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని సెక్టార్-93లో అనురాధ, రామ్‌కుమార్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2010లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వృత్తి రీత్యా నోయిడాలో సెటిలైన రామ్‌కుమార్.. సొంతంగా ఇల్లు కొనడంతో పాటూ బాగా సంపాదించాడు. భార్యా, పిల్లలను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. అన్ని సౌకర్యాలూ ఉన్నందుకు సంతోషపడాల్సిన అనురాధ.. కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టింది. స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలీకుండా ఇద్దరూ రోజూ కలిసేవారు.


భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..

ఈ క్రమంలో రామ్‌కుమార్ సొంతూరుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. నోయిడాలోని ఇల్లు, ఆస్తులు అమ్మేసి వెళ్లిపోదామని భార్యతో చెప్పాడు. అలా వెళ్తే తన ప్రియుడు దూరమవుతాడని ఆమె ఆలోచనలో పడింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. రామ్‌కుమార్‌ను జైలుకు పంపితే తమకు అడ్డుందని కుట్రపన్నారు. ఇందుకోసం ఏతల్లీ చేయని విధంగా తన కుమార్తె నేహా శర్మ (6)ను నవంబర్ 12న గొంతు నులిమి చంపింది. అనంతరం బాలిక మృతదేహాన్ని అడవిలో పడేసింది. తర్వాత కొద్దిసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కూతురు కనపడలేదని, తన భర్తే కిడ్నాప్ చేశాడని బుకాయించింది.

బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ  ప్రారంభించారు. భార్యాభర్తలను విచారించే క్రమంలో అనూరాధపై పోలీసులకు అనుమానం కలిగింది. తర్వాత మరింత లోతుగా విచారించగా ఆమె నేరం అంగీకరించింది. సొంతూరికి వెళ్లిపోతే తన ప్రియుడిని కలుసుకునే అవకాశం ఉండదనే కారణంతోనే ఇలా చేశానని చెప్పింది. దీంతో నిందితురాలు, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement