కొత్తగా పెళ్లయినా.. యువతిలో కనబడని సంతోషం.. ఓ రోజు పక్కింటి కుర్రాడి ఓదార్పుతో ఉపశమనం.. చివరికి..

ABN , First Publish Date - 2021-11-14T02:23:19+05:30 IST

ఢిల్లీలో నివాసం ఉంటున్న దంపతులకు ఊర్మిళ(20) అనే కుమార్తె ఉంది. పెళ్లి వయసు రావడంతో సంబంధాలు చూసేవారు. అయితే కుమార్తె మాత్రం అప్పుడే పెళ్లి వద్దంటూ చెబుతూ ఉండేది. ఓ రోజు సంబంధం రావడంతో

కొత్తగా పెళ్లయినా.. యువతిలో కనబడని సంతోషం.. ఓ రోజు పక్కింటి కుర్రాడి ఓదార్పుతో ఉపశమనం.. చివరికి..
ప్రతీకాత్మక చిత్రం

ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తే.. ఏదో రోజు సమస్య వస్తుంది. కానీ కొందరు మాత్రం సర్దుకుపోయి, సంతోషంగా కాపురం చేస్తుంటారు. ఢిల్లీలో ఓ యువతికి త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ విషయమే తల్లిదండ్రులకు చెప్పింది. కొన్నాళ్లుంటే మనసు మార్చుకుంటుందిలే అని అనుకున్నారు. ఓ రోజూ మంచి సంబంధం వచ్చిందని కూతురితో చెప్పారు. తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఎలాగోలా నచ్చజెప్పి, పెళ్లికి ఒప్పించారు. అత్తగారింటికి వెళ్లిన తర్వాత నుంచి నిరాశతో ఉన్న ఆమె.. చివరకు ఏం చేసిందంటే..


ఢిల్లీలో నివాసం ఉంటున్న దంపతులకు ఊర్మిళ(20) అనే కుమార్తె ఉంది. పెళ్లి వయసు రావడంతో సంబంధాలు చూసేవారు. అయితే కుమార్తె మాత్రం అప్పుడే పెళ్లి వద్దంటూ చెబుతూ ఉండేది. ఓ రోజు సంబంధం రావడంతో ఇష్టం లేకున్నా ఒప్పించి.. రాజ్‌కుమార్ అనే ఓ ఆటో డ్రైవర్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న యువతి.. అత్తగారింట్లోనూ అయిష్టంగానే ఉండేది. రోజూ దిగులుగా ఉండడాన్ని భర్త గమనించేవాడు. ఓపిక నశించి ఓ రోజు గట్టిగా మందలించాడు. అయినా అలాగే ఉండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇలా తీవ్ర నిరాశలో ఉన్న ఆమెకు పక్కింటి ఖాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఓదార్పు లభించడంతో అతడికి బాగా దగ్గరైంది. భర్త లేని సమయంలో ఇంటికి రమ్మని ప్రియుడికి కాల్ చేసి, ఏకాంతంగా గడిపేది.


ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలని ప్రియుడితో చెప్పింది. ఇద్దరూ కలిసి పక్కా పథకం వేశారు. ఓ రోజు రాజ్‌కుమార్ ఆటో ఎక్కిన ఖాన్.. మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్లమన్నాడు. అతడి కుట్ర గ్రహించని రాజ్‌కుమార్ చెప్పినట్లే వెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఆటో ఆపించి, ఒక్కసారిగా తుపాకీతో రాజ్‌కుమార్‌పై కాల్పులు జరిపాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఊర్మిళ, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-11-14T02:23:19+05:30 IST