ఇప్పుడేం చేయాలి?

ABN , First Publish Date - 2021-05-13T05:03:46+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కు ప్రభుత్వం కొత్త నిబంధన.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా రెండో డోసు వేయాలంటే గతంలో 28 రోజుల వ్యవధి ఉండాలన్నారు. తాజాగా 45 రోజులు దాటాలని చెప్పడంతో అనేకమంది అవస్థలు పడ్డారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి... అక్కడ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ కు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా రెండో డోసు వేయాలంటే గతంలో 28 రోజుల వ్యవధి ఉండాలన్నారు. తాజాగా 45 రోజులు దాటాలని చెప్పడంతో అనేకమంది అవస్థలు పడ్డారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి... అక్కడ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు.

ఇప్పుడేం చేయాలి?
టీకా వేసుకునే అవకాశం లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోతున్న వృద్ధుు

రెండు డోసుల మధ్య 45 రోజుల విరామం

ప్రభుత్వం కొత్త నిబంధన

28 రోజులు పూర్తయిన వారికి నిరాశ

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వృద్ధుల అవస్థలు


విజయనగరం: కొవిడ్‌ వ్యాక్సిన్‌ కు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా రెండో డోసు వేయాలంటే గతంలో 28 రోజుల వ్యవధి ఉండాలన్నారు. తాజాగా 45 రోజులు దాటాలని చెప్పడంతో అనేకమంది అవస్థలు పడ్డారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లి... అక్కడ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు.  


ఎస్‌.కోట మండల పరిషత్‌ కార్యాలయం వద్ద  ఏర్పాటు చేసిన  ప్రత్యేక కేంద్రం వద్దకు వ్యాక్సిన్‌ కోసం బుధవారం 50 మంది వరకు వచ్చారు. రెండో డోస్‌ వేసేందుకు ఎంపిక చేసిన 48 పేర్ల జాబితాలో వీరిలో ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం చెబుతున్న 6 నుంచి 8 వారాల గడువు పూర్తి కాకపోవడంతో వీరెవ్వరకీ వైద్య సిబ్బంది టీకాలు వేయలేదు. దీంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. జాబితాలో ఉన్న వ్యక్తులు 8 మందికి మాత్రమే టీకా వేశారు. ఎండలు, కర్ఫ్యూ కారణాలతో మిగతావారు రాలేదు. 


లక్కవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం పంపించిన జాబితాలోని 31 మందిలో నలుగురు మాత్రమే వచ్చారు. అక్కడకు వచ్చిన సుమారు 40 మందిలో 26 మందికి ప్రభుత్వం విధించిన గడువు పూర్తికావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది వీరికి కూడా టీకాలు ఇచ్చారు. 14 మంది మాత్రం రెండో డోస్‌ టీకా లేకుండానే ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. 


ఇదీ బుధవారం జిల్లాలోని వివిధ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద జరిగిన పరిణామాలు. వ్యాక్సిన్‌ కావాలని వచ్చిన వారికి వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది టీకాలు వేయలేకపోయారు. రాని వారికి ఫోన్‌ చేసి పిలిచినారాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌ పక్రియలో మార్పులు చేసింది. ఇందుకోసం సోమ, మంగళవారాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తెరవలేదు. కేవలం రెండో డోస్‌ వేసేందుకు మాత్రమే మండలానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్దకు ఎవరికి వారే వచ్చేయకుండా ప్రభుత్వమే ఎవరికి ఎప్పుడు రెండో డోస్‌ వేయాలన్న జాబితాను తయారు చేసి పంపిస్తోంది. మంగళవారం రాత్రికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌కు అర్హులైన జాబితాను ఫోన్‌ నంబర్‌లతో సహా వలంటీర్లు, ఏఎన్‌ఎంల వాట్సాప్‌లకు పంపించారు. దీంతో ఎవరికి వారే తమ గ్రామాలకు చెందిన వారికి ఫోన్‌ చేసి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకొనేందుకు వెళ్లాలని చెప్పడంతో కేంద్రాలకు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఆన్‌లైన్‌ చేసేందుకు వెబ్‌సైట్‌ తెరుచుకోలేదు.


ఉదయం 11నుంచి 11.30 గంటల సమయంలో వెబ్‌సైట్‌లో ఈ జాబితాకు బదులు ప్రభుత్వం మరో జాబితాను ఫోన్‌ నెంబర్లతో పెట్టింది. దీంతో పాటు మొదటి డోస్‌ వేసుకున్న ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యనున్న వారికి మాత్రమే రెండో డోస్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు జాబితాలో ఉన్న పేర్లనే పిలిచారు. కేంద్రాల వద్దకు వచ్చిన వారిలో ఈపేర్లేవీ లేకపోవడంతో టీకా వేయలేదు. కొత్త జాబితాలో ఉన్న పేర్లకు ఫోన్‌ చేశారు. అత్యధిక మంది రాలేమని చేతులెత్తేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వ్యాక్సిన్‌ కోసం రమ్మంటే ఎలా రాగలమని చాలా మంది ప్రశ్నించారు. కర్ఫ్యూ నేపథ్యంలో రవాణా సదుపాయం లేదు.


ఆ సమయంలో గ్రామాల నుంచి అప్పుటికప్పుడు వచ్చే మార్గం లేక అర్హత ఉన్న వారు  టీకా వేసుకోలేకపోయారు.  రెండో డోస్‌కు వచ్చిన వారికి జాబితాలో పేర్లు లేకపోయినప్పటికీ కొన్ని కేంద్రాల వద్ద ప్రభుత్వం చెప్పిన ఆరు వారాలు దాటిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం 28 రోజులు పూర్తి చేసుకున్న వారు అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా చూసుకుంటే 42 రోజులు పూర్తికావాలి. మార్చి 31కి ముందు టీకాలు వేసుకున్న వారికి ప్రస్తుతం రెండో డోస్‌కు అవకాశం ఉంటుంది. రెండో డోస్‌ వారి పరిస్థితే ఇలా ఉంటే మొదటి డోస్‌ను ఎప్పటి నుంచి ఇస్తారంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు.  సాలూరులో మధ్యాహ్నం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆఫ్‌లైన్‌ పద్ధతిలో 135 మందికి టీకాలు వేశామని సీహెచ్‌సీ ఐపీ యూనిట్‌ వైద్యుడు డా.డాక్టర్‌ సురేష్‌ చంద్రదేవ్‌ తెలిపారు. ఉదయం ఆన్‌లైన్‌ పద్ధతిలో 170 మందికి వ్యాక్సిన్‌ వేశామని చెప్పారు. 


విజయనగరంలో..

విజయనగరంలోని కస్పా హైస్కూల్‌, బీపీఎం హైస్కూల్‌, కంటోన్మెంట్‌, వీటి అగ్రహరం హైస్కూల్‌లో వ్యాక్సిన్‌ కోసం బుధవారం ఏర్పాట్లు చేశారు. కొవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లు సిద్ధం చేశారు. దీంతో రెండో డోస్‌ కోసం ఎక్కువ మంది వచ్చేశారు. 28 రోజులు పూర్తయిన నేపథ్యంలో తమకు వ్యాక్సిన్‌ వేయాలని కోరారు. దీనికి సిబ్బంది అంగీకరించలేదు. ప్రభుత్వ నిబంధనలు మారాయని చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. 45 రోజులకు వేయాలని నిర్ణయించినప్పుడు ఈ విషయాన్ని తమకు ముందే తెలియజేయాలని నిరాశ వ్యక్తం చేశారు. చేసేదిలేక వెనుతిరిగారు. 

Updated Date - 2021-05-13T05:03:46+05:30 IST