యూపీఏనా.. అదెక్కడుంది?: కాంగ్రెస్‌ను ఉద్దేశించి మమత

ABN , First Publish Date - 2021-12-01T23:19:58+05:30 IST

ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సమిష్టి ప్రయత్నాలను చర్చించాము. అంతే కాకుండా మిత్రపక్ష పార్టీల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఒక అవగాహనకు వచ్చాం..

యూపీఏనా.. అదెక్కడుంది?: కాంగ్రెస్‌ను ఉద్దేశించి మమత

ముంబై: ‘యూపీఏ ఏంటి..? అదెక్కడుంది..? ఇక్కడైతే అలాంటిదేమీ లేదు’’.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ అన్న మాటలివి. విచిత్రం ఏంటంటే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను పక్కన పెట్టుకుని మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఎన్‌డీయేకు ప్రత్యామ్నాయం యూపీఏనే.. కాంగ్రెస్ సారథ్యం లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టించలేమని గట్టిగా చెప్పిన వారిలో శరద్ పవార్ ప్రముఖులు.


మమతా బెనర్జీని బుధవారం ముంబైలోని తన నివాసంలో శరద్ పవార్ కలుసుకున్నారు. ‘‘ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి, ప్రజాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సమిష్టి ప్రయత్నాలను చర్చించాము. అంతే కాకుండా మిత్రపక్ష పార్టీల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఒక అవగాహనకు వచ్చాం’’ ట్వీట్ చేశారు పవార్. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీని పవార్ కూడా పక్కన పడేశారా అనే అనుమానాలు వస్తున్నాయి.


బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మూడో ప్రత్యామ్నాయం దిశగా మమతా బెనర్జీ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చాలా కాలంగా అంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బెంగాల్ బయట టీఎంసీని విస్తరిస్తుండడం.. స్థానిక పార్టీ నేతలను కలవడం లాంటివి చేస్తున్నారని అంటున్నారు.

Updated Date - 2021-12-01T23:19:58+05:30 IST