ఏసీలో పనిచేయడం కష్టమే!

ABN , First Publish Date - 2020-02-11T21:20:52+05:30 IST

ఇంట్లో, బయట ఎలా ఉన్నా ఆఫీసుకు వచ్చేసరికి కొందరు ఉక్కపోస్తుందని ఏసీ వేయండంటూ హల్‌చల్ చేస్తుంటారు. ఏసీ ఎక్కువగా ఉండడం ఉండడం

ఏసీలో పనిచేయడం కష్టమే!

ఇంట్లో, బయట ఎలా ఉన్నా ఆఫీసుకు వచ్చేసరికి  కొందరు ఉక్కపోస్తుందని ఏసీ వేయండంటూ హల్‌చల్ చేస్తుంటారు.  ఏసీ ఎక్కువగా ఉండడం ఉండడం వల్ల వారికి బాగానే ఉంటుంది. మహిళలకు మాత్రం ఇబ్బంది కలుగుతుందని  ఓ పరిశోదనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మహిళల పనితీరు మెరుగ్గా ఉన్నదని, చల్లగా ఉన్న ప్రదేశంలో పురుషుల పనీతీరు బాగుందని ఆ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం 500 మంది స్త్రీ, పురుషులను 24 టీమ్‌లుగా విభజింజి వివిధ గదుల్లో ఉంచారు. అందులో 61-91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత మారుస్తూ వారి పనితీరును పరిశీలించారు. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మహిళలు చురుగ్గా పనులు చేసుకోగా చల్లగా మారినప్పుడు పురుషుల పని సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. మహిళలు సాధారణంగా 77 ఫారెన్ డిగ్రీల వాతావరణంలో సౌకర్యంగా ఉంటున్నారు. పురుషులు 72 ఫారెన్ డిగ్రీల ఉష్ణోగ్రతను ఇష్టపడుతున్నారని తేలింది. ఈ మార్పుకు కారణం స్త్రీలు ధరించే దుస్తులు.  కావచ్చని అధ్యయనకారులు భావిస్తున్నారు.

Updated Date - 2020-02-11T21:20:52+05:30 IST