Abn logo
Oct 13 2021 @ 06:29AM

కొత్తగా కారును కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ ఐదు విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..!

ఈ రోజుల్లో కరోనా మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరూ తమ కుటుంబ భద్రత కోసం ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సుల్లో ప్రయాణించడం కంటే సొంతంగా తమ కారులో ప్రయాణించడం మేలు అని భావిస్తున్నారు ప్రజలు. అదికాక ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఆఫర్లు ఉంటాయని.. కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ సెమీకండక్టర్ల కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీని వల్ల కార్ల తయారీకి ఆలస్యం అవుతోంది. దాని ప్రభావం సరఫరాపైనా పడింది. ఏదేమైనా కొత్త కారు కొనేముందు ఈ ఐదు విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..


ఏ కంపెనీ?.. ఏ బ్రాండ్?

ఎప్పుడు కొత్త కారు కొనాలన్నా మనం ఆలోచించేది.. ఏ బ్రాండ్? ఏ కంపెనీ?.. ఏ మోడల్? బాగుంటుంది అని. భారత మార్కెట్లో మారుతి సుజుకీ, హ్యుండాయి, టాటా, మహీంద్రా, ఫోర్డ్, కియా, టొయోటా, హోండా, నిస్సాన్, వోక్స్‌వేగన్ లాంటి చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. వీటిలో మారుతి కంపెనీ ఎక్కువ కార్లు అమ్ముతుంది. తర్వాతి స్థానాల్లో హ్యూండాయి, టాటా నిలుస్తాయి. అలాగని అమ్మకాల విషయంలో వెనుకబడిన కంపెనీల కార్లు బాగుండవా అని అనుకోవడం. ఎందుకంటే ఎక్కువగా కారు కొనాలనే వారు ఏ కంపెనీ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో అదే బ్రాండ్ కొనాలనుకుంటారు. కానీ కారు కొనే ముందు దాని పనితీరు గురించి ముందు ఆలోచించాలి. ఇందుకోసం మీ తెలిసిన వారు కారు వాడుతుంటే వారి కారు ఏ కంపెనీ?, పనితీరు ఎలాగుందో? తెలుసుకోండి.


ఎలాంటి మోడల్?

కారు ఏ కంపెనీ? తీసుకోవాలో అర్థమయ్యాక తరువాతి ప్రశ్న మనకు ఏ మోడల్? కావాలి అని. మోడల్ అంటే మనకు కారు ఎందుకు అవసరమో ఆలోచించుకోవాలి. మార్కెట్లో సెడాన్, SUV, MID SUV, HATCHBACK, MPV  సెగ్మెంట్లలో కార్లు ఉన్నాయి. ఇవన్నీ వాటి అవసరాన్ని బట్టి ఆకారాన్ని రూపొందించబడ్డాయి. ఒకవేళ మీ ఫ్యామిలీలో అయిదుగురు సభ్యులుంటే మీకు HATCHBACK మోడల్ బాగుంటుంది. ఇంకా ఎక్కవ మంది సభ్యులుంటే మీకు కావాల్సింది 7 సీటర్ MPV మోడల్. మీ ఎక్కువగా ప్రయాణించే మార్గంలో రోడ్డు బాగుండదు అనిపిస్తే దానికోసం SUV తీసుకుంటే సరిపోతుంది. ఇంకా లగేజి ఎక్కువగా తీసుకొని ప్రయాణించే వారికోసం సెడాన్ మంచిది.మోడల్ తరువాత బడ్జెట్..

మీరు ఎలాంటి ఉపయోగం కోసం కారు కొంటున్నారో తెలిశాక దాని మోడల్ నిర్ణయించుకుంటారు. దాని తరువాత వచ్చేది ఏ మోడల్.. ఎంత బడ్జెట్‌లో వస్తుందో తెలుసుకోవాలి. ఉదాహరణకు మీకు HATCHBACK సరిపోతుంది అనిపిస్తే దాని ధర ఎంత అని ఆలోచిస్తారు. ఒకవేళ మారుతీ సుజుకీలో HATCHBACK మోడల్ కొనాలనుకుంటే.. అందులో ఆల్టో, ఎస్-ప్రెసో, సెలేరియో, వేగన్ ఆర్, స్విఫ్ట్, ఇగ్నిస్, బాలీనో, ఎస్ క్రాస్ లాంటి ఆపషన్లున్నాయి.  ఇవన్నీ 5 సీటర్ కారు. కానీ వీటి ధరలలో చాలా తేడా ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ అయిదు లక్షల అయితే.. మీరు ఆల్టో, ఎస్-ప్రెసో లేదా సెలేరియోలో ఒకటి తీసుకోవాలి.

ఒకవేళ మీకు మీ బడ్జెట్ కంటే ఎక్కవలో కారు నచ్చినప్పుడు మీరు మీ కారు లోన్‌ని పెంచుకోవాల్సి వస్తుంది. కానీ దానికోసం లోన్‌పై వడ్డీ, లోన్ ప్రాసెసింగ్ ఫీస్, హిడెన్ చార్జెస్, లోస్ క్లోజింగ్ చార్జెస్ వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అలాగే పక్క బ్యాంకు లేదా లోన్లు అందించే రుణ సంస్థలలో లోన్ తీసుకుంటే ఎంతవుతనేది ముందుగానే తెలుసుకోవాలి.మైలేజ్ ఎంత? మెయింటనెన్స్ ఎంత?

కారు కొనేటప్పుడు ప్రధాన అంశం.. అది ఎంత మైలేజి ఇస్తుంది. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ లేదా సిఎన్‌జీ కార్ల మైలేజీ ఎక్కుగా ఉంటుంది. కానీ ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు, డీజిల్ కారు కొనడం దేనికి? ఎందుకంటే డీజిల్ కారు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ. మరి సిఎన్‌జీ కారు కొందామనుకుంటే దాని మైలేజీ బాగుంటుంది కానీ అందులో సిఎన్‌జీ కిట్ కోసం చాలా స్థలం పోతుంది. ఇందుకోసమే సిఎన్‌జీ కార్లలోని బూట్ స్పేస్(డిక్కీ)లో స్థలం ఉండదు.

కారు వార్షిక మెయింటనెన్స్ అంటే.. సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది ముందుగానే తెలుసుకోవాలి. ఈ రోజుల్లో కారు మెయింటనెన్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్ల కంపెనీలే వాటి మెయింటనెన్స్ కోసం ఎంతవుతుందో మెయింటనెన్స్ కాస్ట్ లిస్ట్ జారీ చేస్తాయి.


ఇన్సూరెన్స్?

ఇక చివరి ముఖ్యమైన అంశం ఇన్సూరెన్స్. చాలావరకు కార్ల కంపెనీలు తమ డీలర్‌తో ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు చూడాల్సింది బయట మీకు అంత కంటే తక్కువలో ఇన్సూరెన్స్ దొరుకుతోందా అని. ఇన్సూరెన్స్‌లో భాగంగా కారులో ఉన్న ముఖ్యమైన భాగాలు, ఖరీదైన యాక్సెసరీస్‌కు వారంటీ లేదా గ్యారెంటీ ఉందా అని పేపర్లలో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే టైర్లు, బ్యాటరీ, స్టీరియో వంటి భాగాలపై విడిగా వారంటీ దొరుకుతుంది.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...