వీటికి ఓకే అంటేనే ఇక వాట్సాప్‌

ABN , First Publish Date - 2021-01-09T06:34:21+05:30 IST

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు సెల్‌లో వాట్సాప్‌ మెసేజ్‌లు చూడనిదే చాలామందికి రోజు గడవదు. ఇప్పుడు మెసేజ్‌ అంటే వాట్సాప్‌ అనేంతగా మారింది.

వీటికి ఓకే అంటేనే ఇక వాట్సాప్‌

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు సెల్‌లో వాట్సాప్‌ మెసేజ్‌లు చూడనిదే చాలామందికి రోజు గడవదు. ఇప్పుడు మెసేజ్‌ అంటే వాట్సాప్‌ అనేంతగా మారింది. ప్రొఫెషనల్‌, పర్సనల్‌ సమాచారం అంతా దాదాపుగా దీని ద్వారానే సాగుతోంది.  మొన్న బుధవారం వాట్సాప్‌ తెరవగానే సంబంధిత మెసేజ్‌ ఒకటి మొదట ప్రత్యక్షమైన సంగతి గుర్తుంది కదా.  2021 ఫిబ్రవరి 8 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయన్నది అందులోని సారాంశం. డేటా షేరింగ్‌ వంటి వాటికి ఓకే చెబితేనే వాట్సాప్‌ వినియోగించుకునే అవకాశం ఆ రోజు నుంచి ఉండనుంది. అందుకు అంగీకరించని పక్షంలో అకౌంట్‌ను తొలగించుకోవాల్సిందే. 


ఈ నేపథ్యంలో కొత్త పాలసీ ప్రకారం చేసిన మార్పుల్లో కీలకమైనవి లేదంటే గుర్తించదగినవి ఏమిటన్నది ప్రశ్న. కొత్త పాలసీలో సర్వీసుకు తోడు డేటాను ప్రాసెస్‌ చేసే విధానాన్ని విపులంగా వివరించారు. వాట్సాప్‌ సర్వీసును నిర్వహిస్తున్నది  ఫేస్‌బుక్‌ అన్న విషయం తెలిసిందే. వివిధ వ్యాపారులు సదరు సమాచారాన్ని ఎలా వినియోగించుకుంటాయన్నదీ కూడా తెలిపింది. ఫేస్‌బుక్‌తో ఉన్న అనుబంధం, సమాచారాన్ని కలుపుకొనే విధానాన్ని వివరించింది. 


కొత్త విధానానికి ఇప్పటికే అంగీకారం తెలిపితే, ఫిబ్రవరి 8 నుంచి ఆ నిబంధనలు వర్తిస్తాయి. లేకుంటే, అకౌంట్‌ డిలీట్‌ లేదా మరింత సమాచారం కోసం హెల్ప్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఫేస్‌బుక్‌తో సమాచారాన్ని వాట్సాప్‌ ఎలా షేర్‌ చేసుకుంటుందన్న వివరాలు కొత్త పాలసీలో ఉన్నాయి. ఇంతకుముందు పాలసీలో ఈ నిబంధనలు లేవు. మూడో పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్ల విషయానికి వస్తే, ‘అదర్‌ ఫేస్‌బుక్‌ కంపెనీస్‌’ అంటూ సమాచారం ఇచ్చింది.


అందులో ఆ కంపెనీలు ఇస్తున్న మద్దతు అంటే సాంకేతిక సదుపాయాలు, డెలివరీ తదితర సిస్టమ్స్‌, సర్వీసులకు మార్కెటింగ్‌, సర్వేల నిర్వహణ, పరిశోధన, పరిరక్షణ, భద్రత, యూజర్ల ఇంటెగ్రిటీ, కస్టమర్లకు సహకరించే విధానం వంటివన్నీ తెలియజేసింది. మూడో పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్లు, ఫేస్‌బుక్‌ ఇతర  కంపెనీలతో ఇన్ఫో షేర్‌ చేసుకుంటామని స్పష్టంగా తెలియజేసింది. వాట్సాప్‌ లోపలే మూడో పార్టీ సర్వీ్‌సలతో ఇంటిగ్రేషన్‌ ఉంటుందని పేర్కొంది. పాత పాలసీలో ఈ ప్రస్తావన లేదు.


బ్యాకప్‌ అలాగే మెసేజ్‌లను సేవ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకునే గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ విషయం తెలిసిందే. మూడో పార్టీ లేదా ఫేస్‌బుక్‌ కంపెనీని వాట్సా్‌పతో వచ్చే సమాచారాన్ని ప్లే చేసేందుకు వినియోగించుకున్నప్పుడు ఆ మొత్తం లేదా అందులో కొంత షేర్‌ అవుతుందన్నది కొత్త అంశం. అదేవిధంగా వాట్సాప్‌ మెసేజ్‌లకు ఫేస్‌బుక్‌తో అనుసంధానం ఉండదన్న విధానం మరెంతో కాలం కొనసాగకపోవచ్చు.


Updated Date - 2021-01-09T06:34:21+05:30 IST