Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక మెసేజ్‌లు డిలీట్ చేయక్కర్లేదు!

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ తాజాగా మరో ఫీచర్‌తో ముందుకు రానుందట. ఇక నుంచి చాట్ చేసిన మెసేజ్‌లను డిలీట్ చేసుకునే అవసరం లేకుండా చూడగానే వాటికవే డిలీట్ అయ్యేలా ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికి ఈ ఫీచర్ స్నాప్‌చాట్‌ సహా కొన్ని ప్లాట్‌ఫాంల్లో అందుబాటులో ఉంది. కాగా వాట్సాప్‌లో చాట్ అనంతరం మెసేజ్లు డిలీట్ చేసుకోవడం కష్టమవుతుందనే ఫిర్యాదు యూజర్ల నుంచి ఎప్పటి నుంచో వస్తోంది. ఈ డిమాండ్ ఆధారంగానే తాజా ఫీచర్‌ను ఫేస్‌బుక్ తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫీచర్‌ను విస్తృతంగా కాకుండా సెలెక్ట్ చేసుకన్న కాంటాక్ట్‌ల మట్టుకు మాత్రమే వర్తించేలా రూపొందించనున్నారు.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...