Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాట్సాప్‌నకు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌

వాట్సాప్‌ అనేది ఇప్పుడు వ్యక్తిగత సమాచారానికి కేరాఫ్‌ అడ్రస్‌.  మనం రెగ్యులర్‌గా చాట్‌ చేస్తుంటాం. అందులో చాలా విషయాలు సన్నిహితులు, స్నేహితులు, బంధువులతో పంచుకుంటూ ఉంటాం. అవన్నీ అందరికీ  తెలియాల్సిన అవసరం లేదు. ఆఫీస్‌ గ్రూప్‌లో జోక్స్‌ నుంచి చాలా పర్సనల్‌ సంగతులు ఉంటాయి. ఇవి తెలియకూడదు అనుకుంటే మాత్రం ఫింగర్‌ ప్రింట్‌తో రక్షణ పొందే సౌలభ్యాన్ని వాట్సాప్‌ కల్పించింది. ఆండ్రాయిడ్‌ లేదంటే ఐఫోన్‌ ఏదైనా సరే,  ఫింగర్‌ ప్రింట్‌తో అదనంగా మరో అంచె సెక్యూరిటీని అదనంగా పొందొచ్చు. మీ సన్నిహితులు లేదంటే మీ ఫోన్‌ తీసుకునే వ్యక్తుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. 

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ ఏదైనా సరే, దానికి ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉందో లేదో ముందు చెక్‌ చేసుకోండి. రూ.పది వేలు అంతకు మించిన రేటు ఉన్న ఆండ్రాయిడ్‌ ఫోన్లకు స్కానర్‌ ఉండి తీరుతుంది. ఐఫోన్‌ ఎస్‌ఈ 2020, పాత మోడల్స్‌ అంటే ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 6ఎస్‌కు ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ (టచ్‌ ఐడీ ఉంటుంది).

ఆండ్రాయిడ్‌లో

మీ ఫోన్‌ని అన్‌లాక్‌  చేసేందుకు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ ఉందో లేదో చూసుకోవాలి.

వాట్సాప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - ప్రైవసీలోకి వెళ్ళాలి.

ఫింగర్‌ లాక్‌ ఆప్షన్‌ దగ్గరకు స్ర్కోల్‌ డౌన్‌ చేసుకుంటూ వెళ్ళాలి. అది డిజేబుల్‌ అయి ఉండటాన్ని చూడవచ్చు.

బటన్‌పై టాప్‌ చేయాలి. ఫింగర్‌ ప్రింట్‌ని కన్‌ఫర్మ్‌ చేయాలంటూ మీ ఫోన్‌ మిమ్మల్ని అడుగుతుంది. 

కాల వ్యవధి ఎంత ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పని వెంటనే చేయాలి. ఒక నిమిషం నుంచి ముప్పయ్‌ నిమిషాల వరకు గడువు ఉంటుంది. 

నోటిఫికేషన్స్‌లో మెసేజ్‌ కంటెంట్‌ను హైడ్‌ చేసే ఆప్షన్‌ను చెక్‌ చేసుకోవాలి.

ఐ ఫోన్‌లో

టచ్‌ ఐడీఉందో లేదో చెక్‌ చేసుకోవాలి.

వాట్సా్‌పని ఓపెన్‌ చేసుకోవాలి

సెట్టింగ్స్‌ - అకౌంట్‌ - ప్రైవసీ

స్ర్కీన్‌ లాక్‌ దగ్గరకు స్ర్కోల్‌ డౌన్‌ చేసుకుని దానిపై టాప్‌ చేయాలి. 

‘రిక్వైర్‌ టచ్‌ ఐడి’ ఆప్షన్‌పై టాప్‌ చేయాలి. 

ఒక నిమిషం, పదిహేను నిమిషాలు, 

ఒక గంట ఆప్షన్లు ఉంటాయి. వెనువెంటనే వీటిలో ఒకటి కూడా ఎంపిక చేసుకోవాలి. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...