వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్లు!

ABN , First Publish Date - 2020-09-26T05:40:54+05:30 IST

వాట్సాప్‌ కొత్త పుంతలు తొక్కేందుకు సన్నద్ధమవుతోంది...

వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్లు!

వాట్సాప్‌ కొత్త పుంతలు తొక్కేందుకు సన్నద్ధమవుతోంది. అయిదు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించనుందని, అందుకు చురుకుగా సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.


మల్టీ డివైజ్‌ సపోర్ట్‌

ఈ ఫీచర్‌ తుది దశలో ఉందని వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ‘వెబ్‌టాఇన్ఫో’ చెబుతోంది. బేటా టెస్టర్లకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో వేర్వేరుగా అకౌంట్ల అవసరం లేకుండానే ఒకేసారి నాలుగు డివైజె్‌సలో లాగిన్‌ కావచ్చు. అంటే భిన్నమైన అకౌంట్లు లేకుండా ఐఫోన్‌, ఐపాడ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. 


ఎక్స్‌పైరింగ్‌ మీడియా

ఎక్స్‌పైరింగ్‌ మీడియా అని కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇటీవలి ఆండ్రాయిడ్‌ బేటా అప్‌డేట్‌లో ప్రత్యక్షమైంది. ఛాట్‌ నుంచి వినియోగదారుడు తప్పుకోగానే ఇమేజ్‌లు, వీడియోలు జిఐఎఫ్‌ అన్నీ ఈ ఫీచర్‌తో తొలగిపోతాయి. వాట్స్‌పకు సంబంధించిన ఈ కొత్త ఫీచర్‌ గురించి ‘వెబ్‌టాఇన్ఫో’ రిపోర్ట్‌ చేసింది.   


కస్టమైజబుల్‌ వాల్‌పేపర్స్‌

వేర్వేరు ఛాట్స్‌ కోసం వేర్వేర్‌ వాల్‌పేపర్లను యూజర్‌  ఉపయోగించుకోవచ్చు.  ఎప్పుడైతే యూజర్‌ వాల్‌పేపర్‌ను సెట్‌చేయాలని అనుకుంటాడో అప్పుడు ఆ ఒక్కచాట్‌ కోసం సెట్‌చేయాలా లేకుంటే మొత్తం చాట్స్‌ కోసం సెట్‌ చేయాలా అని అడుగుతుంది. మరొకటి వాడుకోవాలని అనుకున్నప్పుడు ఇది అన్నింటికీ వర్తింపజేయాలా అని యూజర్‌ను అడుగుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలో ఉంది. 


వెకేషన్‌ మోడ్‌

కొన్నాళ్ళ క్రితం పక్కన పెట్టిన ఆలోచనే ఇది. అయితే దీనికి మళ్ళీ వాట్సప్‌ జీవం పోస్తోందని ‘వెబ్‌టాఇన్ఫో’ తెలిపింది. కొత్త ఫీచర్‌ ప్రకారం ఆర్కైవ్స్‌ చాట్స్‌ను మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఆరు నెలల నుంచి యాక్టీవ్‌గా లేని చాట్స్‌ను ఈ ఫీచర్‌ హైడ్‌ చేస్తుంది. 


అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ మోడ్‌

పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నప్పటికీ అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ మోడ్‌ను రూపొందిస్తోంది. ఇందులో ఉండే సెర్చ్‌ బార్‌ సహాయంతో ఫైల్స్‌, ఇమేజెస్‌, వీడియోలను మరింత సులువుగా సెర్చ్‌ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇది పూర్తిగా అడ్వాన్స్‌డ్‌ మోడ్‌.

Updated Date - 2020-09-26T05:40:54+05:30 IST