Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోకాలిపై కూర్చుని గాళ్‌ఫ్రెండ్‌కు ఓ వ్యక్తి పెళ్లి ప్రపోజల్.. సరిగ్గా అప్పుడే ఎంట్రీ ఇచ్చిన కుక్క.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వకుండా ఉండలేరేమో!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్ కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఓ రోజు తన ప్రేమ సంగతి ఆమె చెప్పేయాలని డిసైడ్ అయ్యాడు. ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి.. ‘నా ఇంటిదానివి అవుతావా’ అని అడుగుదాం అనుకున్నాడు. అందుకోసం అంతా రెడీ చేసుకున్నాడు. తన గాళ్‌ఫ్రెండ్‌కు తాను ప్రపోజ్ చేస్తున్న క్షణాలు ఎప్పటితీ గుర్తిండిపోయేలా ఉండేందుకు ఆ దృశ్యాలను వీడియో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతడు ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న ఆ క్షణాలు రానే వచ్చాయి. గాళ్‌ఫ్రెండ్ ముందు మోకాళ్లపై కూర్చుకున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా అప్పుడే అక్కడకు ఓ కుక్క ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అది చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


కెనడాకు చెందిన ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను ఇష్టపడ్డాడు. ఆమె ఒప్పుకుంటే వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తన పెళ్లి ప్రపోజల్‌ను ఆమె ముందు పెట్టడానికి అంతా రెడీ చేసుకున్నాడు. ఆ క్షణాలను కెమెరాలో బంధించి.. జీవితాంతం గుర్తిండిపోయేలా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన గాళ్‌ఫ్రెండ్‌ను ఓ చోటుకు రమ్మన్నాడు. ఆమె వచ్చిన తర్వాత మోకాలిపై కూర్చుని రింగ్ ఇస్తూ.. తన మనసులో మాటను బయటపెట్టేశాడు. దానికి ఆమె కూడా ఒప్పుకోవడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


అనంతరం కెమెరాలో రికార్డు అయిన వీడియోను చూసి అతడు కంగుతిన్నాడు. గాళ్‌ఫ్రెండ్‌కు అతడు ప్రపోజ్ చేస్తుండగా.. కెమెరా ఫ్రేమ్ ముందుకు కుక్క వచ్చి బాత్‌రూం వెళ్లడంతో అతడు షాకయ్యాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నా గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తున్నప్పుడు.. అక్కడకు వచ్చిన మా పెంపుడు కుక్క ఏం చేసిందో చూడండి’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు.. పడిపడి నవ్వుకుంటున్నారు. 
ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement