చెట్టుపై వేలాడుతూనే ప్రసవించిన కొండచిలువ.... వీడియో చూస్తే షాక్!

ABN , First Publish Date - 2021-09-29T16:17:01+05:30 IST

కొండచిలువకు సంబంధించిన ఒక వీడియో నెటిజన్లకు షాకిస్తోంది.

చెట్టుపై వేలాడుతూనే ప్రసవించిన కొండచిలువ.... వీడియో చూస్తే షాక్!

కొండచిలువకు సంబంధించిన ఒక వీడియో నెటిజన్లకు షాకిస్తోంది. అత్యంత వేగంగా వైరల్‌గా మారిన ఈ వీడియోను చూడాలంటే కాస్త ధైర్యం కావాల్సిందే. ఈ వీడియోలో ఒక ఆడ కొండచిలువ... ఒక పిల్ల కొండచిలువకు జన్మనివ్వడాన్ని చూడవచ్చు. ఈ వీడియోను  చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది,,, తాము చిన్నతనం నుంచి పాము గుడ్లు పెడుతుందని విన్నాంగానీ ఇలా పిల్లలను పెడుతుందని ఎప్పుడూ వినలేదని అంటున్నారు. 


కొండచిలువ ఇలా చెట్టుకు వేలాడుతూ పిల్లను పెట్టడం తమకు చాలా వింతగా ఉందని అంటున్నారు. ఆ కొండచిలువ పిల్ల ఎంతో కష్టపడి బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ట్విట్టర్‌లో ఈ వీడియో @sara_s_2020 పేరుతో షేర్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 4 వేలకు పైగా వ్యూస్ లభించాయి. అయితే ఈ వీడియోను చూసినవారంతా దీనిని నమ్మలేకపోతున్నామని, ఈనాటివరకూ తాము పాములు గుడ్లు పెడతాయని మాత్రమే విన్నామంటూ  కామెంట్ చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ వీడియో నెటిజన్లను అమితంగా అలరించడంతోపాటు వణికిస్తోంది.

Updated Date - 2021-09-29T16:17:01+05:30 IST