విద్యుత్తు స్తంభాలను తొలగించేదెన్నడు..?

ABN , First Publish Date - 2021-05-08T07:31:43+05:30 IST

తాళ్లూరులో రోడ్లు వెడల్పు చేశారు... కాని రోడ్డులో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలోని విద్యుత్తు స్తంభాలను తొలగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

విద్యుత్తు స్తంభాలను తొలగించేదెన్నడు..?

ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

రోడ్డు వెడల్పు చేసినా తీరని ట్రాఫిక్‌ కష్టాలు

తాళ్లూరు, మే 7 : తాళ్లూరులో రోడ్లు వెడల్పు చేశారు... కాని రోడ్డులో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉన్న ప్రాంతంలోని విద్యుత్తు స్తంభాలను తొలగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా విద్యుత్తు శాఖ అధికారులు స్తంభాల మార్పునకు చర్యలు చేపట్టలేదు. వివరాల్లోకెళ్తే... తాళ్లూరులో నాలుగేళ్ల క్రితం రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. ఇరువైపులా రోడ్డును విస్తరించారు. దీంతో విద్యుత్తు స్తంభాలు రోడ్డుకు దాదాపు మధ్యలోకి వచ్చాయి. వాటిని తొలగించటంలో ఆ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నాగయ్య కాంప్లెక్స్‌, రజానగరం మలుపు, ఇనుపకొట్టు సుబ్బారెడ్డి ఇంటి సమీపాన తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్తు స్తంభాలను ఆనుకుని స్తంభాలున్నాయి. అవి నిరుపయోగంగా ఉన్నా అధికారులు వాటిని తొలగించలేదు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అవరోధంగా మారింది. రోడ్డు పనులు పూర్తి కావటంతో షాపుల ముందు ఇష్టానుసారం ప్రధాన రోడ్డుపైనే వాహనాలను నిలుపుదల చేస్తుండటంతో వెల్లంపల్లి రోడ్డు, ముండ్లమూరు వెళ్లే మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2021-05-08T07:31:43+05:30 IST