ప్రాణవాయువు ప్రారంభమెప్పుడు.?!

ABN , First Publish Date - 2022-02-24T04:46:42+05:30 IST

సర్వజీవ కోటికి ప్రాణవాయువు(ఆక్సిజన్‌) అత్యంత ముఖ్య మైనది. ఆక్సిజన్‌ లేకపోతే భూమిపై జీవి మను గడే కష్టమవుతుంది.

ప్రాణవాయువు ప్రారంభమెప్పుడు.?!
గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే యంత్రాలు

- జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్‌ ప్లాంట్‌

- గత ఏడాది సెప్టెంబర్‌లో పీఎం కేర్‌ నిధుల నుంచి మంజూరు

- నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్నా నేటికీ వాడుకలోని రాని వైనం 

- ప్లాంట్‌ ప్రారంభమైతే 29 వెంటిలేటర్‌ బెడ్స్‌కు ఉపయోగం


వనపర్తి వైద్యవిభాగం, ఫిబ్రవరి 23: సర్వజీవ కోటికి ప్రాణవాయువు(ఆక్సిజన్‌) అత్యంత ముఖ్య మైనది. ఆక్సిజన్‌ లేకపోతే భూమిపై జీవి మను గడే కష్టమవుతుంది. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా అనేక మంది కరోనా కాటుకు బలైయ్యారు. అప్ప టి నుంచి దేశమంతటా ఆక్సిజన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. కరోనా సందర్భాల్లో ఏర్పడిన ఇబ్బందులను తొలగించడం కోసం ఆక్సిజన్‌ అత్యవసరాన్ని గుర్తించిన అధికా రులు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు ప్రత్యే క ఆక్సిజన్‌ ప్లాంటులను మంజూరు చేసింది. అ లాంటి ప్రాణావాయువు కోసం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి కేర్‌ విభాగం నుంచి నిధులు మం జూరై పనులు చేపట్టారు. మన జిల్లాతో పాటు, అన్ని జిల్లాలకు ప్రత్యేక ఆక్సిజన్‌ ప్లాంటులు ఏర్పా టు చేసేందుకు ఆమోదం రావడంతో ఆక్సిజన్‌ ప్లాంటుల నిర్మాణం పూర్తయి సరఫరా జరుగు తోంది. జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన పీఎస్‌ఏ ప్లాంట్‌ (ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జెక్షన్‌) గత ఏడాది డిసెంబర్‌లోనే ప్లాంట్‌ నిర్మా ణం పూర్తి చేసుకుని సేవకు సిద్ధంగా ఉంది. కానీ కోట్ల రూపాయల విలువ గల ఆక్సిజన్‌ పీఎస్‌ఏ ప్లాంట్‌కు ఒక్క డీజీ సెట్‌ లేకపోవడంతో (డీజిల్‌ జనరేటర్‌ సెట్‌) మొత్తం ప్లాంటు అంతకూడా ని రుపయోగంగా మారింది.  

 నిమిషానికి 500 లీటర్లు 

పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్‌ గాలిలో ఉండే ఆక్సి జన్‌, నైట్రోజన్‌, కార్బోనైట్రోజన్‌లను తీసుకుని స్వ చ్ఛమైన ఆక్సిజన్‌ను నిమిషానికి 500 లీటర్లను ఉ త్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇలా గాలిని ఆక్సిజన్‌గా మార్చుకుని ట్యాంకులో నిల్వ చేసు కుంటూ ఈ ప్లాంట్‌ ద్వారా నిర్విరామంగా వంద పడకల పేషెంట్‌లకు ఆక్సిజన్‌ అందించే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి నుంచి జన రల్‌ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో ఆస్పత్రిలోని ప్రతీ బెడ్‌కు పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ అందించే ఏర్పాటుచేశారు. కానీ పీఎస్‌ఏ ప్లాంట్‌కు జనరే టర్‌ లేకపోవడంతో ప్లాంట్‌ ఉపయోగానికి నోచు కోవడం లేదు. ఫలితంగా అస్పత్రి వర్గాలు 112 డీ ట్రెప్‌ సిలిండర్లు(పెద్దవి), 45 కన్సంటేటర్‌ సిలిం డర్ల ద్వారా ప్రత్యామ్నాయంతో ఆక్సిజన్‌ అందిస్తు న్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒక్క డీ ట్రెప్‌ సిలిండర్‌ నింపి ఇవ్వడం కోసం దాదాపు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు అ య్యేది. ప్రస్తుతం కరోనా ముప్పు తొలగిపోయినా ప్రమాదంలో ఉన్న అత్యవసర రోగుల దగ్గర నుం చి కరోనా, గర్భిణి, ఆపరేషన్‌ జరిపే ప్రతీ సమ యంలో ఆక్సిజన్‌ అత్యంత ప్రామాణికంగా ఉం టుంది. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఆస్పత్రికి అదనంగా మరో 50 పడకలను ఏర్పాటు చేశారు. వాటిలో 60 పడకలు కరోనా రోగుల కోసం కేటా యించగా, 27 పెద్దల కోసం, 2 చిన్నపిల్లల కోసం కలిపి మొత్తం 29 వెంటిలేటర్స్‌ బెడ్స్‌ను కూడా సిద్ధం చేశారు. పీఎస్‌ఏ ప్లాంట్‌ ప్రారంభమైతే 29 వెంటిలేటర్‌ బెడ్స్‌ కూడా వాడుకలోకి వస్తాయని ఆస్పత్రి వర్గాలు తెలుపుతున్నాయి. 

ప్రారంభానికి సిద్ధంగా ఉంది..

డాక్టర్‌ రాజ్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, వనపర్తి 

ప్రెజర్‌ స్వింగ్‌ ఆబ్జె క్షన్‌ ఆక్సిజన్‌ ప్లాంటు నిర్మాణం పూర్తయింది. యంత్రాలు అమర్చి ప్రారంభించేందుకు సి ద్ధంగా ఉన్నాం. ప్రస్తు తం ఒక్క డీజిల్‌ జనరే టర్‌ వస్తే మంత్రి ని రంజన్‌రెడ్డి, కలెక్టర్‌ యాస్మీన్‌బాషా ఆదేశాలతో పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తాం. నిమి షానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ అందించే పీఎస్‌ఏ ప్లాంట్‌తో వంద పడకలకు ఆక్సిజన్‌ సరఫరా చేయవచ్చు. ప్రస్తుతం ఆక్సిజన్‌కు ఎలాంటి కొ రత లేదు. ముందస్తుగా డీ ట్రెప్‌ సిలిండర్లను సిద్ధంగా ఉంచాం. 



Updated Date - 2022-02-24T04:46:42+05:30 IST