Abn logo
Sep 26 2021 @ 17:22PM

షాపింగ్ చేసి తిరిగొచ్చేసరికి కారులో షాకింగ్ సీన్.. Video Viral...

అతను తన కారును పార్కింగ్‌లో పెట్టి, షాపింగ్‌కు వెళ్లాడు. పని పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు. కారు డోరు తీయగానే అనుకోని ఘటన ఎదురైంది. ఊహించని ఘటనకు ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. కొంచెం సేపయ్యాక తేరుకుని.. ఆనందానికి లోనయ్యాడు. ఆ ఘటన తన జీవితంలో మరుపురానిదని సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో.. వివరాల్లోకి వెళ్తే..


తేనెను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ ఆ తేనెను తీయాలంటే అందరి వల్లా కాదు. పొరపాటున వాటి జోలికెళ్తే వెంటబడి వెంటబడి తరుముతాయని అందరికీ భయం. తేనెలు ఎక్కడుంటాయంటే.. అడవులు, ముళ్ల పొదలు అని టక్కున చెబుతాం. ముళ్ల కంపల్లో ఉండే తేనెటీగలు.. జీపులు, కార్లలో చూస్తామా.. ఊహించని ఈ ఘటన నిజంగానే జరిగింది. అది కూడా కేవలం నిముషాల వ్యవధిలోనే..


రిజ్వాన్ ఖాన్ అనే వ్యక్తి సిడ్నీలోని లకేంబాలోని హాల్డన్ స్ట్రీట్‌లో తన జీప్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి.. పక్కనే ఉన్న గ్రాసరీస్ స్టోర్‌లోకి వెళ్లాడు. షాపింగ్ చేసిన పది నిమిషాల తర్వాత జీపు దగ్గరకు వచ్చాడు. జీప్ డోర్ తీయగానే తేనెటీగలను చూసి షాక్ తిన్నాడు. అప్పటికే అవి డ్రైవర్ సీటు పైభాగంలో గూడు ఏర్పరుచుకునే పనిలో ఉన్నాయి. వెంటనే తేరుకున్న రిజ్వాన్ ఖాన్ ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు.


అనంతరం వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. చాలా సంతోషకరమైన వసంతం.. తేనెను నేను పెద్దగా ఇష్టపడను... కానీ తేనెటీగలు మాత్రం నా జీపును ఇష్టపడ్డాయి.. అంటూ, తన సంతోషాన్ని పంచుకున్నాడు. స్థానిక తేనెటీగల పెంపకందారుడు గమనించి రిజ్వాన్‌కు సాయం చేశాడు. ఆ ఈగలను ఓ బాక్సులో నింపుకొని ఇంటికి తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...