Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూల్ నుంచి ఇంటికొచ్చి ఎనిమిదేళ్ల కూతురు చెప్పిన విషయం విని నివ్వెరపోయిన తల్లి.. టాయిలెట్‌లో జరగిన ఘోరం విని..

పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన ఎనిమిదేళ్ల బాలిక తల్లిని చూసి ఏడుపు ప్రారంభించింది.. ఏం జరిగిందో తెలియక తల్లి కంగారుపడింది.. ఆ చిన్నారిని బుజ్జగించి అసలు విషయం తెలుసుకుంది.. స్కూల్ టాయిలెట్‌లో స్వీపర్ చేసిన ఘోరం విని నివ్వెరపోయింది.. వెంటనే భర్తకు విషయం చెప్పి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. స్కూల్ యాజమాన్యంపై, అక్కడ పనిచేసే స్వీపర్‌పై కేసు పెట్టింది.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. 


వారణాసిలోని సన్‌బీమ్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక శనివారం ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్లింది. తిరిగి 1:30కు ఇంటికి వచ్చి తల్లిని చూసి ఏడుపు ప్రారంభించింది. తనకు నొప్పి వస్తోందని చెప్పింది. దీంతో తల్లి ఆ చిన్నారిని బుజ్జగించి ఏం జరిగిందని అడిగింది. `స్కూల్‌లో టాయిలె‌ట్‌కు వెళ్లినపుడు స్వీపర్ అంకుల్ నా వెనుకే వచ్చాడు. నేను బాత్రూమ్‌లోకి వెళ్లగానే లోపలికి వచ్చి తలుపేశాడు. ఆ తర్వాత నా నోరు మూసి ఏదో చేశాడు. నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఎంతలా ఏడ్చినా వదల లేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడ`ని ఆ బాలిక తల్లికి చెప్పింది. 


దీంతో బాలిక తల్లి తన భర్తకు విషయం చెప్పింది. అతను వెంటనే పోలీసులకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. నిందితుడు అజయ్ కుమార్‌ను పాఠశాల యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. నిందితుడిపై పోలీసుల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement