Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 04:23AM

Telanganaలో సెలవుల పొడగింపుపై స్పష్టత ఎప్పుడు..?

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యాసంస్థల సెలవుల పొడగింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. గతంలో తెలంగాణ విద్యా శాఖ జనవరి 8 నుంచి 16 వరకు ప్రకటించిన సెలవులు ఆదివారంతో ముగుస్తున్నందున ఈ విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెలవులు ప్రకటించిన తర్వాత కరోనా, ఒమైక్రాన్‌ కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెలవులు పొడగించాలా? వద్దా అన్న అంశంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు రాష్ట్ర విద్యాశాఖ వర్గాల్లో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలిసింది.  

Advertisement
Advertisement