Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్క సీట్లో యువతితో ప్రేమయాణం సాగించాడు.. కలిసి తిరిగాడు.. పెళ్లి సమయంలో షాకింగ్ విషయం బయటపెట్టాడు..

వారిద్దరూ సహోద్యోగులు.. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.. ఇద్దరూ శారీరకంగా, మానసికంగా దగ్గరయ్యారు.. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.. ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు.. అయితే పెళ్లి సమయంలో ఆ యువకుడిది వేరే మతం అని బయటపడింది.. షాకైన యువతి తరఫు వారు పెళ్లి రద్దు చేశారు.. యువతి కూడా అతడికి దూరమైంది.. దీంతో అతడు ఆమెను వేధించడం ప్రారంభించాడు.. తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయిన బాధిత మహిళకు, అక్కడే పని చేస్తున్న సహాన్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ శారీరకంగా, మానసికంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు. అయితే పెళ్లి సమయంలో ఓ షాకింగ్ ఘటన బయటపడింది. యువకుడి అసలు పేరు సహాన్ కాదని, ఆరిఫుల్ మాలిక్ అని తేలింది. దీంతో హిందూ కుటుంబానికి చెందిన యువతి తరఫు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. యువతి కూడా అతడికి దూరమైంది. 


పెళ్లి రద్దు అయిపోందనే కక్షతో ఆరిఫుల్ బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని యువతిని బెదిరించడం ప్రారంభించాడు. అతడి నెంబర్‌ను బ్లాక్ చేసినా.. ఈ-మెయిల్, సోషల్ మీడియా ద్వారా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో బాధిత యువతి ఆదివారం ఉదయం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరిఫుల్‌ను అరెస్ట్ చేశారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement