Abn logo
Sep 21 2021 @ 00:24AM

పేదల భూముల జోలికి వస్తే ఊరుకోం

సమావేశంలో మాట్లాడుతున్న శంకర్‌నాయక్‌

డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌


మిర్యాలగూడ/మిర్యాలగూడ రూరల్‌, సెప్టెంబరు 20: సెజ్‌ ఏర్పాటు పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ హెచ్చరించారు. మండలంలోని జాలుబాయితండా, ఆలగడప, రాయినిపాలెం గ్రామాల రైతులతో సోమవారం మాట్లాడారు. భూ సర్వే జాబితాలో ఉన్న రైతులందరూ చిన్న, సన్న కారు రైతులే అని తెలిపారు. 606 సర్వేనెం. 413మంది రైతులకు సంబంధించిన 421ఎకరాల పంట భూములను రైతుల అం గీకారం లేకుండా బలవంతంగా భూమి సేకరించడం సరికాదన్నారు. 413మంది రైతుల్లో 10మంది మినహా అందరూ రెండు ఎకరాల్లోపు ఉన్న పేదలే  అని తెలిపారు. వేల ఎకరాల ప్రభుత్వములుండగా పేదల పట్టా భూములను ఎలాంటి సమాచారం లేకుండా భూసేకర ణ పేరుతో సాగు భూముల నుంచి పేద రైతులను వెళ్లగొట్టాలను కోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. భూమిలేని దళితులకు భూమి ఇస్తామని మాటనిలపుకోలేని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటు పేరుతో దొంగచాటు గా ఉన్న భూములను గుంజుకుంటోందన్నారు. ఆలగడప భూసేకర ణ గెజిట్‌ను ప్రభుత్వం రద్దు చేయకుంటే ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, కిసాన్‌ కాంగ్రేస్‌ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, సర్పంచ్‌ లాలునాయక్‌, ఎంపీటీసి జగ్గారెడ్డి, పోలగాని వెంకటేశ్‌గౌడ్‌, కాకునూరి బసవయ్య, సీపీఎం నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, ఆర్‌, మోహన్‌రెడ్డి, కౌన్సిలర్‌ చల్లా వెంకన్న పాల్గొన్నారు.