పాజిటివ్‌ నిర్ధారణ కాగానే..ఆస్పత్రికి తరలించాలి

ABN , First Publish Date - 2020-05-21T11:06:22+05:30 IST

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగానే వెనువెంటనే ఆస్పత్రులకు తరలించాలని కలెక్టర్‌ గంధం

పాజిటివ్‌ నిర్ధారణ కాగానే..ఆస్పత్రికి తరలించాలి

త్వరితగతిన ఫలితాల వెల్లడి : కలెక్టర్‌ 


అనంతపురం, మే 20(ఆంధ్రజ్యోతి) : కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగానే వెనువెంటనే ఆస్పత్రులకు తరలించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంపిల్స్‌ సేకరణ, పరీక్షలు త్వరితగతిన నిర్వహించి ఫలితాలు వెల్లడించాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన కొవిడ్‌ నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు.


పాజిటివ్‌ కేసుల తరలింపులో జాప్యం తన దృష్టికి వచ్చిందన్నారు. అలా చేయడం మూలంగా వైరస్‌ మరింత వ్యా ప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఎక్కడికక్కడ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకుని పాజిటివ్‌ కేసులను కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పాజిటివ్‌ కేసులకు నెగిటివ్‌ నిర్ధారణ కోసం ఇచ్చిన శాంపిల్స్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే ఫలితాలు ఇవ్వాలని సూచించారు. కొవిడ్‌ పోర్టల్‌ డేటా ఎంట్రీలో ఆలస్యంతో పాటు కొన్నితప్పులు దొర్లుతున్నాయ ని, అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.


ఆస్పత్రి, క్లినికల్‌, డిశ్చా ర్జ్‌ మేనేజ్‌మెంట్‌ వేగవంతంగా జరగాలన్నారు. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌ల పంపిణీపై నివేదిక ఇవ్వాలన్నారు. ప్రొటోకాల్‌ ప్రకా రం అవసరమైన వారందరికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు పంపిణీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌, డీసీహెచ్‌ డాక్టర్‌ రమే్‌షనాథ్‌లను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు కొవిడ్‌-19పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్‌, ల్యాబ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ స్వర్ణలత, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T11:06:22+05:30 IST