రేషన్‌ కార్డులకు మోక్షం ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-10-20T07:18:26+05:30 IST

ఆహార భద్రత కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతోంది.. అయితే ఏడాదిన్నర నుంచి కార్డులను మంజూరు చేయకపోవడంతో అ ర్హులైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్‌ కార్డులకు మోక్షం ఎప్పుడు?

ఏడాదిన్నర నుంచి ఎదురుచూపులు  

కరోనా సహాయానికి నోచుకోని అర్హులు  

ఇబ్బందులు పడుతున్న పేదలు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఆహార భద్రత కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతోంది.. అయితే ఏడాదిన్నర నుంచి కార్డులను మంజూరు చేయకపోవడంతో అ ర్హులైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరో నా నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నెల కు ఒక్కో వ్యక్తికి 12కిలోల చొప్పున రేషన్‌ బియ్యం ఉచితంగా అందజేయగా, రెండు మాసాల నుంచి న వంబర్‌ వరకు 10 కిలోల చొప్పున కేంద్ర ప్రభుత్వం బియ్యం అందజేస్తున్నది. వరుసగా మూడు నెలల పాటు కిలో చొప్పున ఇచ్చిన కంది పప్పుకు అనేక మంది నోచుకోలేదు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 8 వే లకు పైగా రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తు లు జిల్లా అధికారుల వద్ద పెండింగులో ఉన్నాయి. 


తెరుచుకోని లాగిన్‌..

ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా రేషన్‌ కార్డుల కోసం, ఉన్న వాటిలో చేర్పుల, మార్పుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్రస్థాయి లో మండల తహసీల్దార్లు పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి లాగిన్‌కు పంపించారు. ఇక్కడ వాటిని పరిశీలించిన అధికారులు మంజూ రుకు సిద్ధమైనప్పటికీ ఏడాదిన్నర నుంచి లాగిన్‌ తెరుచుకోకపోవడంతో కార్డులు మంజూరు కావడం లేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి రేషన్‌ కార్డులు మంజూరు కావడం లేదని అర్హులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వాళ్లు కొత్త గా రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఇది వరకే ఉన్న కార్డు లోంచి వారి పేరును తొ లగిస్తేనే దరఖాస్తు చేసుకు నేందుకు అవ కాశం ఉంటుంది. అలా చాలా మంది కొత్త కార్డుల కోసం ఉమ్మడి కుటుంబం కార్డుల నుంచి పేర్లను తొల గించుకున్నారు. కానీ కార్డులు మంజూరు కావ డం లేదు. రెంటింకి చెడ్డ రేవడిలా మారింది వారి పరిస్థి తి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వచ్చి న వాళ్లు కూడా పలువురు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి కూడా మంజూరు కావ డం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధి కారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాత రేషన్‌ కార్డులను రద్దు చేసి కొత్తగా ఆహార భద్రత కార్డుల ను జారీ చేసిన విషయం తెలిసిందే.


గతంలో ఒక్కో వ్యక్తికి 4 కిలో లు, గరిష్టంగా 20 కిలోలకు మించకుండా బియ్యాన్ని ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున కు టుంబంలో ఎంత మం ది ఉంటే అంత మందికి బియ్యాన్ని ఇస్తున్నారు. 2018 డిసెంబర్‌ ఎన్నికలు జరిగే వరకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరంగా సాగిం చింది. ఆ తర్వాత వరుసగా గ్రామ పంచాయతీ, పార్లమెంట్‌, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను కూడా నిర్వహించారు. ఆ తర్వాతనైనా రేషన్‌ కార్డులను మంజూరు చేస్తారని అర్హులైన వాళ్లు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వాటి జోలికి పోవ డం లేదు. కరోనా నేప థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేయగా, ఏప్రిల్‌, మే నెలకు గాను నిత్యావస ర సరుకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డులు కలిగిన వారికి 1500 రూ పాయల చొప్పున అందజే శారు. ఒక్కో వ్యక్తికి జూన్‌ మాసం వరకు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందజేశారు. జూలై మాసం నుంచి 10 కిలోల చొప్పున నవంబర్‌ వరకు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయిం చి అమలు చేస్తున్నారు.


ఆరోగ్య సేవలకు దూరం..

రేషన్‌కార్డులు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందుతుండగా, కార్డులు లేని వాళ్లు ఆ సేవలకు నోచుకోవడం లేదు. ఈ కా ర్డులపై ఏడాదికి 2 లక్షల రూపాయల వరకు నిర్ణీత ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుం టారు. కార్డులు లేని వాళ్లు డబ్బులు పెట్టుకునే వై ద్యం చేయించుకుంటున్నారు. అలాగే ఇతరత్రా ప్ర భుత్వ పథకాలకు కూడా రేషన్‌ కార్డుతో లింకు ఉన్నది. ఇది లేని కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల నుంచి దక్కాల్సిన ప్రయోజనాలను పొందలే కపోతున్నారు. మండల తహసీల్దార్‌ కార్యాలయా ల చుట్టూ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల చు ట్టూ తిరుగుతున్నా కార్డులు రావడం లేదు. ప్రభు త్వం తీసుకున్న నిర్ణయం వల్ల కార్డులు మంజూరు కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పం దించి నూతన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను పునరుద్ధరించాలని అర్హులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-20T07:18:26+05:30 IST