కూతురి ప్రశ్న... ‘‘నా ప్రపంచమే మారిపోయింది’’ అంటూ Amitabh భావోద్వేగం!

అమితాబ్ బచ్చన్ మరో మైలురాయి దాటనున్నారు. ఈ శుక్రవారం ప్రసారం అయ్యే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్‌తో ఆయన వెయ్యో భాగం పూర్తి చేయనున్నారు. గత 21 ఏళ్లుగా కేబీసీ హోస్ట్‌గా ఆయన ప్రయాణం కొనసాగుతూనే ఉంది. అయితే, లెటెస్ట్ ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిథులుగా బిగ్ బి కూతురు, మనవరాలు హాజరుకానున్నారు. వారితో బాలీవుడ్ షెహన్‌షా మాటామంతీ ప్రస్తుతం ప్రోమోస్ రూపంలో ఆసక్తిని కలిగిస్తున్నాయి... 


కేబీసీ వెయ్యవ ఎపిసోడ్ స్పెషల్ ప్రొమో ఒక దాంట్లో... అమితాబ్‌ని కూతురు శ్వేతా నందా... ‘‘ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు?’’ అని ప్రశ్నించింది. దానికి ఆయన ‘‘నా ప్రపంచం మొత్తం మారిపోయింది’’ అంటూ సమాధానం ఇచ్చారు. అలాగే, రెండు దశాబ్దాలుగా సాగుతోన్న కేబీసీ షోలో అమితాబ్‌కు సంబంధించిన పలు అందమైన సందర్భాల్ని ఒక్క చోట చేర్చి వీడియో ప్లే చేశారు. ఆ క్లిప్పింగ్ చూసిన బిగ్ బి ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి... 


‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో మొదలయ్యే సమయంలో అమితాబ్ బచ్చన్ అనేక ఆర్దిక ఇబ్బందుల్లో ఉండేవారు. సినిమా నిర్మాణ సంస్థ కారణంగా అప్పట్లో అప్పుల పాలయ్యారు. కానీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్విజ్ షో కారణంగా మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు బిగ్ బి! అందుకే, ఆయన కేబీసీ కారణంగా తన ప్రపంచమే మారిపోయిందని వ్యాఖ్యానించారు...                                                                                   

Advertisement

Bollywoodమరిన్ని...