Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెరువులో స్నానం చేస్తున్న కుర్రాడు.. సరిగ్గా అదే సమయంలో నీళ్లలోకి దూకేసిన యువతిని చూసి..

ఇంటర్నెట్ డెస్క్: చెరువులో దూకి ఈత కొడుతూ స్నానం చేస్తున్నాడా కుర్రాడు. ఇంతలో కొద్ది దూరంలో ప్రత్యక్షమైన ఒక యువతి ఉన్నట్లుండి చెరువులో దూకేసింది. ఈ ఘటన చూసి కంగు తిన్న సదరు యువకుడు.. వెంటనే ముందుకు దూకి ఆ యువతిని కాపాడే ప్రయత్నాలు ప్రారంభించాడు. కాసేపటికి చాలా శ్రమపడి ఆమెను రక్షించాడు. అదే సమయంలో తన మొబైల్ తీసుకొని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సదరు యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ యువతి తను ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించిందీ వివరించింది. తాను ఒక యువకుడిని ప్రేమిస్తున్నానని, కొంత కాలంగా అతనితో సన్నిహితంగా ఉంటున్నానని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అడిగితే సదరు యువకుడు ఒప్పుకోవడం లేదని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని చెప్పింది.


ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో వెలుగు చూసింది. బాధితురాలు ఒకసారి మొబైల్ కొనుగోలు చేయడానికి బజారు వెళ్లింది. అప్పుడే ఆమెకు విశాల్ వాల్మీకి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ మొబైల్‌లో ఎప్పుడూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకోవాలని విశాల్ అన్నాడు. ఆమె తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు రావాలని కోరాడు. అతని మాట కాదనలేని యువతి బర్త్ డే పార్టీకి వెళ్లింది. వీళ్లిద్దరే చేసుకున్న ఈ పార్టీలో ఆమెను పెళ్లి చేసుకుంటానని విశాల్ మాటిచ్చాడట. అనంతరం వీళ్లిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరి బంధం ఇలాగే కొనసాగింది. అయితే కొన్ని రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడగడంతో కథ అడ్డం తిరిగింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి విశాల్ నిరాకరించాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి.. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement