సన్‌స్ర్కీన్‌ ఎప్పుడు?

ABN , First Publish Date - 2020-02-24T08:16:13+05:30 IST

వేసవి మొదలైంది. ఎండ తీవ్రత నెమ్మదిగా పెరుగుతోంది. కాబట్టి సన్‌స్ర్కీన్స్‌ వాడకం మొదలుపెట్టక తప్పదు. అయితే సన్‌స్ర్కీన్‌ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి? అనే విషయంలో అనుమానాలు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి.

  • - వేసవిలో ఎండలోకి వెళ్లే సమయంలో మాత్రమే సన్‌స్ర్కీన్‌ అప్లై చేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇంట్లో నీడపట్టున ఉన్నా ప్రతి నాలుగు గంటలకు ఒకసారి సన్‌స్ర్కీన్‌ పూసుకుంటూనే ఉండాలి.

  • - ఎండలోకి వెళ్లే అరగంట ముందు మరోసారి సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి.

  • - వాటర్‌ బేస్డ్‌ సన్‌స్ర్కీన్స్‌ అయితే జిడ్డు లేకుండా ఉంటాయి.

  • - పొడి చర్మం కలిగినవారు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, ఆ తర్వాత సన్‌స్ర్కీన్‌ వాడాలి.

  • - ముంజేతులు, మెడ, ఛాతీ దగ్గర కూడా సన్‌స్ర్కీన్‌ పూసుకోవాలి. 

  • - ఎస్‌.పి.ఎఫ్‌ 30 అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్ర్కీన్‌ వాడడం 
  • శ్రేయస్కరం.

  • - సున్నిత చర్మం కలిగినావాళ్లు చర్మ వైద్యుల సూచన మేరకు 50 ప్లస్‌ సన్‌స్ర్కీన్‌ లోషన్స్‌ వాడాలి.

Updated Date - 2020-02-24T08:16:13+05:30 IST