మేం అధికారంలోకి వస్తే సీఏఏ అమలు చేయం: ప్రియాంక

ABN , First Publish Date - 2021-03-02T21:50:43+05:30 IST

రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు.

మేం అధికారంలోకి వస్తే సీఏఏ అమలు చేయం: ప్రియాంక

గువహాటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అంతే కాకుండా ఆ చట్టాన్ని నిలిపివేసేలా మరో చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు.


‘‘విడదీసి పాలించు అనే సూత్రాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తోంది. ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతైనా.. భారతావనంతా ఒక్కటే. సీఏఏ అనే దుర్మర్గపు చట్టంతో దేశంలో విభజన రేఖలు గీస్తున్నారు. ఈ ప్రభావం అస్సాంపై చాలా ఎక్కువ ఉంది. నేను ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. మా పార్టీ అధికారంలోకి వస్తే కొత్త చట్టంతో సీఏఏను అడ్డుకుంటాం. రాష్ట్రంలో సీఏఏను అమలు కాకుండా చూసుకుంటాం’’ అని ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. వీటితో పాటు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు.

Updated Date - 2021-03-02T21:50:43+05:30 IST