రాత్రిపూట తినొచ్చా?

ABN , First Publish Date - 2020-10-18T21:36:50+05:30 IST

పిల్‌, అరటి పండు... రెండూ చాలా ఆరోగ్యకరమైనవే. తినమని వైద్యులు సైతం చెబుతారు. కానీ ఆ రెండింటినీ రాత్రి పడుకోబోయే ముందు తినకపోవడం ఉత్తమం. ఆపిల్‌లో పోషకాలు పుష్కలంగా

రాత్రిపూట తినొచ్చా?

ఆంధ్రజ్యోతి(18-10-2020)

ఆపిల్‌, అరటి పండు... రెండూ చాలా ఆరోగ్యకరమైనవే. తినమని వైద్యులు సైతం చెబుతారు. కానీ ఆ రెండింటినీ రాత్రి పడుకోబోయే ముందు తినకపోవడం ఉత్తమం. ఆపిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారికి ఆ ఆమ్లాలు కూడా తోడైతే రాత్రిపూట మరింత ఇబ్బంది తప్పదు. కనుక ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్లు రాత్రి పూట ఆపిల్‌కు దూరంగా ఉండడం మంచిది. ఇక అరటిపండు సంగతికొస్తే... ఇది కూడా చాలా అత్యావశ్యకమైన ఆహారమే. కానీ రాత్రి పూట తింటే జలుబుకు దారితీసే అవకాశం ఉంది. అలాగే పరగడుపున కూడా దీన్ని తినకపోవడమే మంచిది. తిన్న వెంటనే నిమిషాల్లో శక్తినిచ్చి... అంతే త్వరగా అలసటను కలిగిస్తుంది. టిఫిన్‌, మఽధ్యాహ్న భోజనం తిన్నాక అరటిపండు, ఆపిల్‌ లాంటివి తింటే ఆరోగ్యం. 

Updated Date - 2020-10-18T21:36:50+05:30 IST