యాసంగి చెల్లింపులు ఎప్పుడు..?

ABN , First Publish Date - 2021-06-21T03:44:02+05:30 IST

రైతులకు యాసంగి పంట డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి, రైస్‌ మిల్లు లకు చేరినా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు నగదు జమ కాలేదు. ఆన్‌లైన్‌లో సంబంధిత రైతులు, ధాన్యం వివరాలు నమోదు చేయడంలో జాప్యం కారణంగా చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్యాడీ పర్చేజింగ్‌ సెంటర్లలో నిర్ధేశిత లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

యాసంగి చెల్లింపులు ఎప్పుడు..?

 ధాన్యం కొనుగోలు పూర్తయినా ఖాతాల్లో జమకాని నగదు

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం

ప్యాడీ పర్చేజింగ్‌ సెంటర్‌ నిర్వాహకుల వైఖరే కారణం

 జిల్లాలో 1500 మంది రైతులకు అందని డబ్బులు

మంచిర్యాల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రైతులకు యాసంగి పంట డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి, రైస్‌ మిల్లు లకు చేరినా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు నగదు జమ కాలేదు. ఆన్‌లైన్‌లో సంబంధిత రైతులు, ధాన్యం వివరాలు నమోదు చేయడంలో జాప్యం కారణంగా చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్యాడీ పర్చేజింగ్‌ సెంటర్లలో నిర్ధేశిత లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు లెక్కకు మించి ధాన్యం సరఫరా చేయడంతో సకాలంలో వివరాలు సేకరించ డంలో జాప్యం కారణంగా నగదు చెల్లింపుల్లోనూ ఆల స్యం అవుతోంది. వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధ మవుతుండగా ఇంతవరకు యాసంగి డబ్బులు బ్యాం కు ఖాతాల్లో జమకాకపోవడంతో పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాం కేతిక కారణాల వల్ల కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి చేరకపోవడంతో సకాలంలో చెల్లింపులు జరగడం లేదని తెలుస్తోంది.

జిల్లా లక్ష్యం ఇలా...

యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 245 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 2 లక్షల 23వేల 479 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో ఐకేపీ సెంటర్ల ద్వారా 55,412 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయగా, పీఏసీ ఎస్‌ ద్వారా 87,145 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 80,921 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం ఇప్ప టికే రైస్‌మిల్లులకు చేరింది. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లో బ్యాంకు అకౌంట్లలో నగదు జమకావలసి ఉండగా నెల రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికంద లేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకు 86 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు సమాచారం. మరో 14 శాతం పెండింగులో ఉంది. ఐకేపీ సెంటర్లలో 88 శాతం ఆన్‌లైన్‌ నమోదు పూర్తికాగా, పీఏసీఎస్‌లో 83, డీసీఎంఎస్‌లలో 89 శాతం నమోదు ప్రక్రియ పూర్తయింది. 

రైతులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం....

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం నగదు చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగు తోంది. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత గరిష్టంగా 15 రోజుల లోపు సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమకావలసి ఉండగా జిల్లాలో చెల్లింపులు పెండిం గులో ఉన్నాయి. యాసంగికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 32,881 మంది రైతుల నుంచి ఽప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు చేసిన మేరకు రూ.421 కోట్ల 92 లక్షల 80వేల 122 చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటి వరకు 31,376 మంది రైతుల కు సంబంధించిన ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి కాగా రూ. 353 కోట్ల 89 లక్షల 93 వేల 478 బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మరో 1,505 మంది రైతు లకు సంబంధించిన రూ.68 కోట్ల 2 లక్షల 86వేల 644 పెండింగులో ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ అధికా రులు ఇప్పటికే సిద్ధం చేయగా రైతులు పంట సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే వానాకాలం సీజన్‌ ప్రారం భమయ్యేలోపు చెల్లింపులు జరుగుతాయా అనే సందేహాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అంచనాకు మించి ధాన్యం రావడంతోనే....

గెడం గోపాల్‌, సివిల్‌ సప్లయీస్‌ జిల్లా మేనేజర్‌

యాసంగి ధాన్యం కొనుగోళ్లు అంచనాకు మించి జరుగడంతోనే నగదు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోం ది. రైస్‌మిల్లులకు కేటాయించిన అలాట్‌మెంట్‌కు మించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధికంగా సరఫరా చేశారు. దీంతో రైస్‌మిల్లర్ల వద్ద సమాచారం అందుబాటులో లేక చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. 


Updated Date - 2021-06-21T03:44:02+05:30 IST