గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలా.. వద్దా?

ABN , First Publish Date - 2020-08-07T09:38:43+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో గ్రేటర్‌లో గణేశ్‌ నవరాత్రోత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించాలా.. వద్దా?

 రేపు ఉన్నతస్థాయి సమావేశం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నేపథ్యంలో గ్రేటర్‌లో గణేశ్‌ నవరాత్రోత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శనివారం సమావేశం జరగనుంది. నగరంలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకుల సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు. సమావేశానికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్స వ సమితి ప్రతినిధులు, ఖైరతాబాద్‌, బాలానగర్‌ గణేశ్‌ ఉత్స వ నిర్వాహకులు పాల్గొంటారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించాలా.. వద్దా? అన్న విషయంపై  చర్చించనున్నారు. 

Updated Date - 2020-08-07T09:38:43+05:30 IST