కరోనా టైంలో బతకడానికి ఏ దేశం బెస్ట్?

ABN , First Publish Date - 2021-04-30T12:57:22+05:30 IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజలంతా భయంభయంగానే బ్రతుకుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశంలో ప్రజలు ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు?

కరోనా టైంలో బతకడానికి ఏ దేశం బెస్ట్?

సింగపూర్: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజలంతా భయంభయంగానే బ్రతుకుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ దేశంలో ప్రజలు ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు? ఈ కరోనా టైంలో ఏ దేశంలో జీవనం సులభంగా ఉంది? అని బ్లూమ్‌బర్గ్ సంస్థ సర్వే చేసింది. ఇంతకుముందు చేసిన ఈ సర్వేలో తొలిస్థానంలో న్యూజిల్యాండ్ ఉంది. అక్కడ కరోనాను నియంత్రించిన తీరుతో ఆ దేశానికి అగ్రస్థానం దక్కింది. అయితే ఈ ఏప్రిల్‌లో ఆ దేశాన్ని సింగపూర్ దాటేసింది.


వైరస్ వ్యాప్తిని నియంత్రించడం, వ్యాక్సినేషన్ ద్వారా సింగపూర్ కరోనాను చాలావరకు నిలువరించింది. ఆసియా మొత్తంలో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లో ఇది ఒకటి. అందుకే ఈ ద్వీపదేశానికి తొలిస్థానం అందించింది బ్లూమ్‌బర్గ్. ఆ తర్వాతి స్థానంలో వరుసగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, తైవాన్, సౌత్ కొరియా, జపాన్, యూఏఈ, ఫిన్‌ల్యాండ్, హాంగ్‌కాంగ్ ఉన్నాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ జాబితాలో పదిస్థానాలు దిగజారి 30వ స్థానానికి పడిపోయింది మనదేశం.

Updated Date - 2021-04-30T12:57:22+05:30 IST