వయసు కనిపించకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN , First Publish Date - 2021-02-26T19:46:22+05:30 IST

సరైన ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, దుమ్ము, కాలుష్యాల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యమైన కాంతివంతమైన చర్మం కావాలంటే మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలు

వయసు కనిపించకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఆంధ్రజ్యోతి(26-02-2021)

ప్రశ్న: వయసు కనిపించకుండా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి? చర్మ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


-హిమజ, హైదరాబాద్


డాక్టర్ సమాధానం: సరైన ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, దుమ్ము, కాలుష్యాల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఆరోగ్యమైన కాంతివంతమైన చర్మం కావాలంటే మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కాయగూరలు ఎక్కువగా ఉండాలి. విటమిన్ - సి అధికంగా ఉండే జామ, నారింజ, కమలా, కివి; విటమిన్ - ఎ అధికంగా ఉండే బొప్పాయి, కర్బుజా; పలు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన మామిడి, పుచ్చ, దానిమ్మ, ద్రాక్ష లాంటి పండ్లను రోజుకు రెండు సార్లయినా తీసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్ లాంటి వివిధ రంగుల కూరగాయలు, అన్నిరకాల ఆకుకూరలు కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చర్మం జిడ్డు పట్టడం తగ్గాలంటే నీకు అధికంగా తీసుకోవడమే కాక ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. వేయించిన ఆహారం, స్వీట్లు, చాక్‌లెట్లు, చేకరీ ఫుడ్స్ తినకూడదు. టీ కాఫీలు తగ్గించాలి. పాలు, పెరుగు తప్పనిసరి. మీగడ లేదా వెన్న తీసినవి మాత్రమే వాడాలి. చీజ్, పనీర్, మాంసాహారం మితంగా తీసుకోవాలి. రోజూ ఓ పిడికెడు బాదం, పిస్తా, ఆక్రోట్ లాంటి గింజలు తినాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్ర్కీన్ లోషన్ రాసుకోవడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-02-26T19:46:22+05:30 IST