బరువు తొందరగా తగ్గడానికి ఏది మేలు?

ABN , First Publish Date - 2020-11-13T18:16:34+05:30 IST

ఏ ఆహార పదార్థమైనా తగిన పరిమాణంలో తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ముడి బియ్యం, గోధుమ రొట్టెల కంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో పీచుపదార్థాలు,

బరువు తొందరగా తగ్గడానికి ఏది మేలు?

ఆంధ్రజ్యోతి(13-11-2020)

ప్రశ్న: ముడి బియ్యం, చపాతీలు, జొన్నరొట్టెల్లో ఏవి తినడం వల్ల బరువు తొందరగా తగ్గే అవకాశం ఉంది?


- శ్రీదేవి, సూర్యాపేట


డాక్టర్ సమాధానం: ఏ ఆహార పదార్థమైనా తగిన పరిమాణంలో తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ముడి బియ్యం, గోధుమ రొట్టెల కంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో పీచుపదార్థాలు, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. కాస్త తినగానే కడుపు నిండినట్టుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అయితే ముడి బియ్యం, చపాతీలు, జొన్నరొట్టెలు... ఏదైనా సరే వాటితో పాటు తీసుకునే కూరలు, పప్పు పరిమాణాన్ని బట్టి బరువు తగ్గడం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఒకే ధాన్యాన్ని రోజూ తీసుకోకుండా అన్ని రకాలనూ తీసుకోవాలి. ఆకుకూరలూ, కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. వెన్న తీసిన పాలు, పెరుగు మాత్రమే తీసుకోవాలి. ఇంకా శారీరక వ్యాయామం, తగినంత నిద్ర అవసరం. వీటన్నిటినీ పాటిస్తే బరువు తగ్గడం సులభమే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-11-13T18:16:34+05:30 IST