డయాబెటీస్ ఉన్నవారికి ఏ రైస్ మంచివి?

ABN , First Publish Date - 2021-03-13T18:16:28+05:30 IST

మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలు ఎంత త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో చేరతాయి అనే దానికి కొలమానం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌. ఇది ఎక్కువగా ఉండే పదార్థాల నుండి గ్లూకోజు త్వరగా రక్తంలో చేరుతుంది. తెల్లబియ్యం, బ్రౌన్‌ రైస్‌తో పోలిస్తే బాస్మతి బ్రౌన్‌ బియ్యంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ

డయాబెటీస్ ఉన్నవారికి ఏ రైస్ మంచివి?

ఆంధ్రజ్యోతి(13-03-2021)

ప్రశ్న: మామూలు బ్రౌన్‌ రైస్‌, బాస్మతి బ్రౌన్‌ రైస్‌ పోషక విలువల్లో తేడా ఏంటి? డయాబెటీస్‌ ఉన్న వారికి ఏవి మంచివి?


- ఆచార్య, వరంగల్‌


డాక్టర్ సమాధానం: మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలు ఎంత త్వరగా గ్లూకోజుగా మారి రక్తంలో చేరతాయి అనే దానికి కొలమానం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌. ఇది ఎక్కువగా ఉండే పదార్థాల నుండి గ్లూకోజు త్వరగా రక్తంలో చేరుతుంది. తెల్లబియ్యం, బ్రౌన్‌ రైస్‌తో పోలిస్తే బాస్మతి బ్రౌన్‌ బియ్యంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. కాబట్టి డయాబెటీస్‌ ఉన్న వారికి  రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో తీసుకుంటే ఎటువంటి బియ్యం అయినా రక్తంలో చక్కర శాతం పెరుగుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, ప్రొటీన్‌ అధికంగా ఉండే పప్పుధాన్యాలను ఎక్కువ మోతాదులో; పిండిపదార్థాలు బాగా ఉండే బియ్యం, గోధుమలు వంటి ఽధాన్యాలను మితంగా తీసుకుంటే డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Read more