అందుకే Aryan Khan కు బెయిల్ ఇవ్వడం లేదు.. కోర్టు చెప్పిన ఐదు కారణాలు ఇవే..!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ముంబై స్పెషల్ కోర్టు మరోసారి నిరాశనే మిగిల్చింది. ఈ సారి బెయిల్ వస్తుందనుకున్న ఆర్యన్ ఆశలపై నీళ్లు జల్లింది. మూడోసారి కూడా ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది. దీంతో ఆర్యన్ తరఫు న్యాయవాది ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ రోజు (గురువారం) సింగిల్ బెంచ్ ముందు ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మరి, హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. కాగా, ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ ముంబై స్పెషల్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. 


1)ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌కు చెందిన డీలర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


2)సంబంధిత వ్యక్తుల గురించి ఆర్యన్ వద్ద పూర్తి సమాచారం ఉంది. అయినా ఇప్పటివరకు ఆర్యన్ వారి గురించి నోరు విప్పలేదు. వారి గురించి ఆర్యన్‌కు తప్ప మరొకరికి తెలియదు. ఆర్యన్‌ను బెయిల్‌పై విడిచి పెడితే సాక్ష్యాలను తుడిచేసే ప్రమాదం ఉంది. 


3)ఆర్యన్‌కు ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేకపోయినప్పటికీ.. నిషేధిత డ్రగ్స్ యాక్టివిటీస్‌తో సంబంధం ఉంది. ఆర్యన్‌తో పాటు అరెస్ట్ అయిన వారందరూ ఒకే తరహా వ్యక్తులు. ఎన్‌సీబీ విచారణలో ఎవరూ తమ సప్లయర్స్ గురించి నోరు విప్పలేదు. 


4)వ్యక్తుల వద్ద డ్రగ్స్ దొరకనప్పటికీ.. స్పాట్‌లో దొరికిన మొత్తం మాదక ద్రవ్యాలకు అక్కడున్న అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 


5)ఆర్యన్ వాట్సాప్ ఛాట్‌ ద్వారా భారీ మొత్తంలో డ్రగ్స్ గురించి, హార్డ్ డ్రగ్స్ గురించి సమాచారం లభించింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ సంభాషిస్తున్నట్టు వాట్సాప్ ఛాట్ ద్వారా నిరూపితమైంది.   

 

పై కారణాలు చెబుతూ ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది. 

Advertisement

Bollywoodమరిన్ని...