విహార యాత్రకు వెళ్లిన మహిళ.. డ్యామ్ చూస్తుండగా ఫోన్‌కు మెసేజ్.. ఆ మెసేజ్ చూసి షాకై పోలీస్ స్టేషన్‌కు పరుగు..!

ABN , First Publish Date - 2022-01-24T22:37:59+05:30 IST

ఆమె తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లింది.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తోంది..

విహార యాత్రకు వెళ్లిన మహిళ.. డ్యామ్ చూస్తుండగా ఫోన్‌కు మెసేజ్.. ఆ మెసేజ్ చూసి షాకై పోలీస్ స్టేషన్‌కు పరుగు..!

ఆమె తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లింది.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తోంది.. ఆ సమయంలో ఆమె మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. బ్యాంక్ ఖాతా నుంచి రూ.40 వేలు విత్ డ్రా అయినట్టు ఆ మెసేజ్ ద్వారా తెలిసింది.. దీంతో ఆ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ ప్రాంతానికి చెందిన కృష్ణా హల్దార్ అనే మహిళ ఆదివారం ఉదయం తన కుటుంబంతో కలిసి దుధ్వా డ్యామ్ చూసేందుకు వెళ్లింది. కొద్ది సేపటికి ఆమె మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.40 వేలు విత్ డ్రా అయినట్టు ఆ మెసేజ్‌లో ఉంది. దీంతో ఆమె షాకై తన పర్సు కోసం వెతికింది. అయితే పర్సు ఎక్కడా కనిపించలేదు. ఆ పర్సులోనే ఆమె ఏటీఎమ్ కార్డు ఉంది. ఎవరో దొంగ పర్సు కొట్టేసి ఏటీఎమ్ కార్డు ద్వారా డబ్బులు కాజేశాడని ఆమె గ్రహించింది. 


స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఏటీఎమ్ కార్డు మీద గాని, పర్సులో గాని తన పిన్ నెంబర్ లేదని, అయినా ఆ దొంగ తన పిన్ నెంబర్ ఎలా కనుగొన్నాడో తెలియడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-01-24T22:37:59+05:30 IST