అక్రమకట్టడాలు, ఆక్రమణలపై కొరడా ఝళిపించండి

ABN , First Publish Date - 2020-09-18T06:11:47+05:30 IST

నగర పాలక సంస్థ పరిధిలోని అక్రమకట్టడాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలపై కొరఢా ఝళి

అక్రమకట్టడాలు, ఆక్రమణలపై కొరడా ఝళిపించండి

టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు కమిషనర్‌ క్రాంతి ఆదేశం 


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 17: నగర పాలక సంస్థ పరిధిలోని అక్రమకట్టడాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలపై కొరఢా ఝళి పించి వాటిని తొలగించాలని, తిరిగి ఆక్రమ ణలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిష నర్‌ వల్లూరిక్రాంతి మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మున్సిపల్‌ కార్యాల యంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నగరంలోని అక్రమ కట్టడాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని సూచించారు. అనేకచోట్ల అక్రమ కట్టడాలు, ఆక్రమణలు జరుగుతున్నట్లు పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపట్ల ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమకట్టడాలకు సంబంధించిన వారికి ముందస్తు నోటీ సులుజారీ చేయాలని, ఆతర్వాత వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. అల్గునూర్‌ బ్రిడ్జి, జంక్షన్‌ సుందరీకరణ కోసం సర్వేను వెంటనే చేపట్టాలని అన్నారు. స్మార్ట్‌ రోడ్లు త్వరగా పూర్తయ్యేందుకు ఆక్రమ ణలను సంబంధిత యజమానులతో మాట్లాడి తొలగించి రోడ్డుపనులకు క్లియరెన్సు ఇవ్వాలని సూచించారు.


పీఎం స్వనిధి రుణాలను..వెంటనే మంజూరీ చేయాలి 

ప్రధానమంత్రి స్వనిధి రుణాలను అర్హులైన వారందరికీ వెంటనే మంజూరీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి బ్యాంక ర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో స్వనిధి రుణాలపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వనిధి రుణాలపై ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరీ చేయాలని అన్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని వీధివ్యాపారులను రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిప్పుకోవద్దని అన్నారు. అన్ని బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నిటినీ పరిశీలించి వీలైనంత త్వరగా వారికి రుణాలను మంజూరీ చేయాలని కోరారు.

Updated Date - 2020-09-18T06:11:47+05:30 IST