అమెరికాలో దుప్పులకూ కరోనా

ABN , First Publish Date - 2021-08-04T13:03:17+05:30 IST

మెరికాలో నగర ప్రాంతాలకు సమీపంలో నివసించే వైట్‌ టెయిల్డ్‌ డీర్‌ల (ఒకరకం దుప్పి) శరీరాల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు.

అమెరికాలో దుప్పులకూ కరోనా

వాటి శరీరాల్లో యాంటీబాడీల గుర్తింపు

రివర్స్‌ జూనోసిస్‌ ముప్పుపై శాస్త్రజ్ఞుల ఆందోళన

వాషింగ్టన్‌, ఆగస్టు 3: అమెరికాలో నగర ప్రాంతాలకు సమీపంలో నివసించే వైట్‌ టెయిల్డ్‌ డీర్‌ల (ఒకరకం దుప్పి) శరీరాల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నడుమ 385 నమూనాలు సేకరించి పరీక్షించగా.. వాటిలో  152 నమూనాల్లో (దాదాపు 40ు) యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడించారు. పరిశోధనకు వారు వీటినే ఎందుకు ఎంచుకున్నారంటే.. వాటిలో కరోనా వైర్‌సను ఆకర్షించే ఏస్‌-2 రిసెప్టార్లు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి వీటికి వైరస్‌ సోకితే వాటి శరీరాల్లో రిజర్వాయర్లు ఏర్పరచుకుని ఉంటుంది. ఇలా వన్యప్రాణుల్లో కరోనా వైరస్‌ రిజర్వాయర్లు   ఉండిపోతే.. మానవులు వ్యాక్సిన్లు వేయించుకున్నా, వైరస్‌ ముప్పు ఇంకా పొంచే ఉంటుందని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు.. ఈ దుప్పుల నుంచి వేరే జీవులకు సోకి, ఈ క్రమంలో ఉత్పరివర్తనాలకు గురై, కొత్త వేరియంట్ల రూపంలో మళ్లీ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుందన్నది శాస్త్రజ్ఞుల ఆందోళన. ఇలా సోకడాన్ని ‘రివర్స్‌ జూనోసి్‌స’గా వ్యవహరిస్తారు. వారు చేసిన ఈ పరిశోధన ఫలితాలు బయో ఆర్కైవ్‌ ప్రీప్రింట్‌ సర్వర్‌లో ప్రచురితమయ్యాయి.

Updated Date - 2021-08-04T13:03:17+05:30 IST