డబ్ల్యూహెచ్‌ఓ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం: భారత్‌ బయో

ABN , First Publish Date - 2021-09-18T07:02:56+05:30 IST

అత్యవసర అనుమతి పొందడానికి కొవాగ్జిన్‌కు సంబంధించిన అన్ని వివరాలు, డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు సమర్పించామని...

డబ్ల్యూహెచ్‌ఓ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం: భారత్‌ బయో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అత్యవసర అనుమతి పొందడానికి కొవాగ్జిన్‌కు సంబంధించిన అన్ని వివరాలు, డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు సమర్పించామని, ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. జూలై ప్రారంభంలో ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్‌)కు దరఖాస్తు చేశాం. డబ్ల్యూహెచ్‌ఓ అడిగిన అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చాం. నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. వీలైనంత త్వరలో డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం లభించగలదని భావిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-09-18T07:02:56+05:30 IST