Abn logo
Sep 25 2020 @ 01:37AM

సన్నాయి స్వరాలు ఎవరి కోసం?

Kaakateeya

ప్రముఖ బాలీవుడ్‌ నటి జాహ్నవికపూర్‌ నవవధువుగా మారారు. అయితే రియల్‌ వెడ్డింగ్‌ కోసం కాదు. ఓ ఫొటోషూట్‌ కోసం ఆమె అలా కనిపించారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా లేటెస్ట్‌గా డిజైన్‌ చేసిన పెళ్లికూతురు దుస్తులు ధరించి ఇందులో పాల్గొన్నారు. ఆ ఫొటోషూట్‌లో ఆమె చాలా అందంగా కనిపించారు. ఆ ఫొటోలను జాహ్నవి తన్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నారు. ‘‘మీకు సన్నాయి స్వరాలు వినిపిస్తున్నాయా? అవి నా కోసమేనా?’’ అనే సరదా వ్యాఖ్యను జోడించారు. ఈ ఫొటోల్లో సంప్రదాయ ఆభరణాలు, గ్రీన్‌ లెహంగా ధరించి జాహ్నవి అందంగా కనిపించారు. ఈ ఫొటోలకు కొన్ని గంటల్లోనే 3 లక్షల లైక్స్‌ వచ్చాయి. సోనమ్‌కపూర్‌, భూమి పడ్నేకర్‌ లాంటి పలువురు నటులు ‘వెలిగిపోతున్నావు’ అంటూ జాహ్నవిని ప్రశంసించారు. 

Advertisement
Advertisement
Advertisement