కొవిడ్ కేసుల tsunami...డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన

ABN , First Publish Date - 2021-12-30T16:02:32+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొవిడ్ కేసుల tsunami...డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనావైరస్ ఒమైక్రాన్, డెల్టా వేరియంట్‌లు కలిపి సునామీలా కేసులు పెరుగుతున్నాయని దీనిపై తాను ఆందోళన చెందుతున్నానని డాక్టర్ ఘెబ్రేయేసస్ చెప్పారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొవిడ్ -19 కేసుల సంఖ్య గత వారంతో పోలిస్తే 11 శాతం పెరిగింది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 13,154 తాజా కొవిడ్-19 కేసులు వెలుగుచూశాయి.దేశంలో గురువారం నాటికి 961ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదు కాగా, వీటిలో 320 మంది విదేశాల నుంచి వచ్చినవారున్నారు.


ఢిల్లీలో అత్యధికంగా 263మందికి, మహారాష్ట్రలో 252మందికి ఒమైక్రాన్ సోకింది. గుజరాత్, రాజస్థాన్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమైక్రాన్ కట్టడి కోసం చెన్నై నగరంలో కొత్త సంవత్సరవేళ వాహనాల రాకపోకలను నిలిపివేశారు.ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముంబైలో 144 సెక్షన్ విధించారు.భారత్ తోపాటు రష్యా, దక్షిణాఫ్రికా, యూకే దేశాల్లో ఒమైక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 


Updated Date - 2021-12-30T16:02:32+05:30 IST